జగన్‌ను వదిలేయండి, అంత అవసరమైతే, అది చూసి మార్కులు వేస్తా: చంద్రబాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తన పాదయాత్రలో ప్రభుత్వంపై ఆయన చేసే విమర్శలకు మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, నాయకులు ధీటుగా స్పందిస్తున్నారు.

  జగన్‌ ఆస్తుల్ని అందుకే స్వాధీనం చేసుకోలేకపోతున్నా: చంద్రబాబు నాయుడు | Oneindia Telugu

  బోటు ప్రమాదం: పబ్లిసిటీ పిచ్చి, అఖిలప్రియను టార్గెట్ చేసిన జగన్ పార్టీ

  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి ఆదేశాలు జారీ చేశారు. జగన్ పాదయాత్రపై ఎక్కువగా మాట్లాడవద్దని సూచించారు. ఆయన గురించి మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే, ఆయనకు మనం అంత ప్రచారం చేసినట్లు అవుతుందని తెలిపారు.

   జగన్ పాదయాత్రపై మాట్లాడాల్సి వస్తే

  జగన్ పాదయాత్రపై మాట్లాడాల్సి వస్తే

  జగన్ పాదయాత్ర గురించి కచ్చితంగా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు పార్టీ నాయకులు ఎవరి ఇష్టానికి వారు మాట్లాడటం కాకుండా సమన్వయం చేసుకోవాలని నేతలకు సూచించారు. జనగ్ పాదయాత్ర ప్రభావం పెద్దగా ఏమీ లేదన్నారు.

  మంత్రులను గట్టిగా ప్రశ్నించండి

  మంత్రులను గట్టిగా ప్రశ్నించండి

  నిర్మాణాత్మక సలహాలు ఇవ్వడంలో మొహమాటం వద్దని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు సూచించారు. వివిధ పథకాలు, కార్యక్రమాల అమల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే మంత్రులను గట్టిగా ప్రశ్నించాలన్నారు. మంత్రులు కూడా ఆయా అంశాలపై పూర్తి సన్నద్ధతతో అసెంబ్లీకి రావాలన్నారు.

   ఆ భావన ప్రజల్లో కలిగేలా చేయండి

  ఆ భావన ప్రజల్లో కలిగేలా చేయండి

  విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదని సమావేశాలను తేలిగ్గా తీసుకోవద్దని చంద్రబాబు సూచించారు. వారు లేకపోవడం వల్లే అర్థవంతమైన చర్చ జరుగుతోందన్న భావన ప్రజల్లో కలిగేలా చేయాలన్నారు. ఈ రెండు రోజుల్లో ప్రజా సమస్యలపై ఎక్కువగా చర్చించారన్న భావన అందరిలో వ్యక్తమవుతోందన్నారు.

   దానిని చూసి మార్కులు వేస్తా

  దానిని చూసి మార్కులు వేస్తా

  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాల్లో మరింత మెరుగ్గా మాట్లాడాలని చంద్రబాబు సూచించారు. మాట్లాడేటప్పుడు హావభావాలు ఎలా ఉన్నాయి, ఆయా అంశాలపై లోతైన అధ్యయనంతో మాట్లాడారా లేదా, ప్రజలకు సూటిగా చేరేలా ఉందా, అనే అంశాల ఆధారంగా మార్కులు వేస్తానని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  AP CM Nara Chandrababu Naidu on Monday suggested party leaders to don't talk about YSR Congress Party chief YS Jaganmohan Reddy's Padayatra.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి