వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపు రిజర్వేషన్లపై టైం కావాలి: హైకోర్టుకు ఏపీ, బాబు హ్యాపీ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీలోని కాపు తదితర కులాలను బీసీ జాబితాలో చేర్చాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్ పైన ఏపీ సర్కారు కౌంటర్ దాఖలు చేయడానికి హైకోర్టు మరికొంత గడువునిస్తూ హైకోర్టు ఉత్తర్వులు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.

కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల్ని బీసీల్లో చేర్చే విధంగా సర్కారును ఆదేశించాలని కోరుతూ కాపు రిజర్వేషన్ల పోరాట సమితి ఛైర్మన్‌ కెవికె రావు, ఏపీ కాపునాడు, పశ్చిమ గోదావరి జిల్లా కాపునాడు అధ్యక్షులు సిహెచ్ వెంకట రాయుడు గతేడాది డిసెంబరులో హైకోర్టును ఆశ్రయించారు.

Also Read: చంద్రబాబు ప్లాన్: నారా లోకేష్‌ను పక్కకు తప్పించారా?

గతంలో ఈ వ్యాజ్యాన్ని విచారించిన జడ్జి... కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ఈ అంశాన్ని అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం, కమిషన్ను ఏర్పాటు చేసిందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు సమయం కావాలన్నారు.

మరోవైపు, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు గురువారం నాడు గుంటురు జిల్లా చిలకలూరిపేటలో, కృష్మా జిల్లా ఆత్కూరులో ఏర్పాటు చేసిన స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ శిక్షణా కార్యక్రమాలలో బిజీబిజీగా గడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

 చిలకలూరిపేటలో వెంకయ్య-చంద్రబాబు

చిలకలూరిపేటలో వెంకయ్య-చంద్రబాబు

ప్రతి వ్యక్తి సమాజం కోసం కొంతైనా ఆలోచించాలని, ఎంత డబ్బు సంపాదించినా కలగని ఆనందం సామాజిక సేవ ద్వారా దొరుకుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా సేవా కార్యక్రమాలు ఉండాలని, ఇవ్వడంలో ఉండే ఆనందం ఒకసారి అనుభవిస్తే జీవితంలో ఎవరూ మరువరని వ్యాఖ్యానించారు.

 చిలకలూరిపేటలో వెంకయ్య-చంద్రబాబు

చిలకలూరిపేటలో వెంకయ్య-చంద్రబాబు

ప్రపంచంలోని చాలా ఉత్తమ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులన్నీ సేవా సంస్థల ద్వారానే ఏర్పాటు అయ్యాయన్నారు. నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే విషయాన్ని 15 ఏళ్ల కిందటే వెంకయ్య నాయుడు గుర్తించి స్వర్ణభారత్‌ లాంటి ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారన్నారు.

 చిలకలూరిపేటలో వెంకయ్య-చంద్రబాబు

చిలకలూరిపేటలో వెంకయ్య-చంద్రబాబు

స్వర్ణ భారత్‌ లాంటి ట్రస్ట్‌ల సహకారంతో మన దేశం మళ్లీ ఖచ్చితంగా స్వర్ణ భారతంగా మారుతుందనే నమ్మకం తనకుందన్నారు. ఓ మహోన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన ఈ వేదికను వినియోగించుకుని యువత తమకు ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యాన్ని, సమర్థతను పెంపొందించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

 చిలకలూరిపేటలో వెంకయ్య-చంద్రబాబు

చిలకలూరిపేటలో వెంకయ్య-చంద్రబాబు

మహిళలు, రైతులు, యువతకు మార్గదర్శనం చేస్తూ వారిలో నైపుణ్యం పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ సేవలు ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు.

 చిలకలూరిపేటలో వెంకయ్య-చంద్రబాబు

చిలకలూరిపేటలో వెంకయ్య-చంద్రబాబు

వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రతి మనిషి తనతో పాటూ కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం కూడా కొంతైనా ఆలోచించాలని సూచించారు. తనకు రాజకీయంగా ప్రజాసేవలో సంతృప్తి దొరుకుతుందని, స్వచ్ఛంద సేవతో మహా సంతృప్తి, మహదానందం కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

 చిలకలూరిపేటలో వెంకయ్య-చంద్రబాబు

చిలకలూరిపేటలో వెంకయ్య-చంద్రబాబు

పదిహేనేళ్లుగా స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ తనకు మూడో బిడ్డగా మారిపోయిందన్నారు. రాజకీయంగా ఎంత తీరికలేకుండా ఉన్నా క్రమం తప్పకుండా వచ్చి నెల్లూరులోని ట్రస్ట్‌ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వాడినని చెప్పారు. దానివల్ల తనకు ఎంతో ఆనందం, ఆత్మ సంతృప్తి కలిగేవని తెలిపారు.

 చిలకలూరిపేటలో వెంకయ్య-చంద్రబాబు

చిలకలూరిపేటలో వెంకయ్య-చంద్రబాబు

ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోకుండా, గ్రామీణ యువతకు ఉపాధి శిక్షణ అందించడం, తెలుగు సంస్కృతికి వెలుగులద్దడం అనే నిబంధనలు పెట్టుకుని పది మంది మిత్రుల సహకారంతో ట్రస్ట్‌ను నడుపుతున్నట్టు వెంకయ్య వెల్లడించారు. క్రమశిక్షణకు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ మారుపేరన్నారు. తనకు ట్రస్ట్‌ కార్యకలాపాలతో నేరుగా సంబంధం లేదని, అనుబంధం మాత్రం చాలా ఉందని వ్యాఖ్యానించారు.

చిలకలూరిపేటలో వెంకయ్య-చంద్రబాబు

చిలకలూరిపేటలో వెంకయ్య-చంద్రబాబు

రైతులకు, మహిళలకు, గ్రామీణ యువతకు ఆసరాగా నిలిచే లక్ష్యంతో ట్రస్ట్‌ కొనసాగుతుందని చెప్పారు. తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించే విషయంలో కూడా ట్రస్ట్‌ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని, కొల్లు, కామినేని, ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని, మాగంటిబాబు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దీపా వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

English summary
The spirit of Vizag and its citizens received a pat from the guests at Sameer Lab's stone laying ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X