అదే కొంపముంచుతుంది: నేతలకు బాబు హెచ్చరిక, ‘టార్గెట్ 175’

Subscribe to Oneindia Telugu

విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేతల్లో అతి విశ్వాసం వద్దని ఏపీ సీఎం, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు. త్వరలో టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 11 నుంచి 50 రోజులపాటు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

అతి విశ్వాసం వద్దు..

అతి విశ్వాసం వద్దు..

అతి విశ్వాసంతో వ్యవహరించ వద్దని నేతలకు సూచించారు. అతి విశ్వాసమే కొంప ముంచుతుందని హెచ్చరించారు. ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణను త్వరలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణాలకు వెంటనే నిధులు విడుదల చేస్తామని చెప్పారు.

ప్రశంసలు

ప్రశంసలు

సెప్టెంబర్ 28వ తేదీ వరకు చంద్రన్న బీమా దరఖాస్తుల గడువు పెంచనున్నట్లు వెల్లడించారు. నంద్యాల, కాకినాడలో నేతల మంచి ప్రతిభ కనబర్చారని సీఎం ప్రశంసించారు. టీడీపీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు వివరించారు.

దూకుడు పెంచాలి..

దూకుడు పెంచాలి..

పులివెందుల నియోజకవర్గంలో హర్టీ కల్చరుకు మంచి అవకాశం ఉందని.. అక్కడ రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తామని చంద్రబాబు చెప్పారు. నంద్యాల ఫలితంతో కాకినాడ నేతలు రిలాక్స్ అయితే.. వెంటనే వారిని హెచ్చరించి పరుగులు పెట్టించానని చంద్రబాబు చెప్పారు. పార్లమెంట్ ఇంఛార్జీలులుగా వ్యవహరిస్తున్న మంత్రులు మరింత దూకుడుగా పని చేయాలని బాబు సూచించారు.

175 స్థానాలే లక్ష్యం

175 స్థానాలే లక్ష్యం

వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి లోకేశ్‌ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యనిర్దేశాన్ని చేరుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ 11 నుంచి చేపడుతున్న ‘ఇంటింటికి తెలుగుదేశం' ద్వారా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. అలాగే ఏవైనా సమస్యలుంటే తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Saturday warned his party leaders for overconfidence.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి