వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుఫాన్లు వచ్చేస్తున్నాయ్! జాగ్రత్త: చంద్రబాబు హెచ్చరిక

రాష్ట్రానికి అక్టోబర్ 18, 20 తేదీల మధ్య భారీ తుఫాను రానుందని.. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రానికి అక్టోబర్ 18, 20 తేదీల మధ్య భారీ తుఫాను రానుందని.. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై సోమవారం చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన సంకల్పం మంచిదైతే.. ఫలితాలు కూడా బాగుంటాయని చెప్పారు. సమర్థ నీటి నిర్వహణ, నీరు-ప్రగతి, జలసంరక్షణ కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమని చంద్రబాబు తెలిపారు.

chandrababu naidu warns on cyclones

కొంచెం ఆలస్యమైనా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయని చెప్పారు. దీంతో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. భూగర్భ జలమట్టం కూడా 5.5మీటర్లు పెరిగిందని చంద్రబాబు చెప్పారు. చెక్ డ్యాంల నిర్మాణం, పంట కుంటల తవ్వకాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Monday warned officials and people on cyclones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X