షాక్: ఆ 40 స్థానాల్లో పార్టీ బలహీనం, తీరు మార్చుకోకపోతే మార్చేస్తా: బాబు సంచలనం
అమరావతి: ఏపీ రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి పరిస్థితి బాగా లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.పదవుల్లో ఉన్న వారు సక్రమంగా పని చేయకపోతే తప్పిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఒకరిద్దరు మంత్రులు మినహ ఎవరూ కూడ సక్రమంగా పని చేయడం లేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
Recommended Video

టిడిపి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ పనితీరుపై పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు చర్చించారు.
2019 ఎన్నికల కోసం పార్టిని బలోపేతం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. అయితే పార్టీ అధినేత సూచనలకు అనుగుణంగా పార్టీ నేతలు, మంత్రులు పని చేయడం లేదని చంద్రబాబునాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

40 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై బాబు అసంతృప్తి
ఏపీ రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ 40 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే విషయంలో చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంఛార్జీలు, మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. ఈ 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని మెరుగుపర్చుకొనేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీలు పనిచేయాలని బాబు ఆదేశించారు. లేకపోతే ఇంఛార్జీలను మార్చనున్నట్టు చంద్రబాబు హెచ్చరించారు.

మంత్రులు పనితీరు మార్చుకోవాలి
పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంఛార్జీలుగా ఉన్న మంత్రుల పనితీరు సక్రమంగా లేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పార్టీని బలోపేతం చేసేందుకు మంత్రులు చొరవ చూపాలని బాబు ఆదేశించారు. ఒకరిద్దరూ మినహ మిగిలిన మంత్రులెవరూ కూడ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదని బాబు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రులు పరిటాల సునీత, భూమా అఖిలప్రియను చంద్రబాబునాయుడు సున్నితంగా మందలించారని సమాచారం.

ఆ నేతల పనితీరుపై బాబు ఇలా
పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉంటూ పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్న నేతల పనితీరుపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య,,కొత్తపల్లి సుబ్బారాయుడు పనితీరుపై బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనితీరును మెరుగుపర్చుకోవాలని బాబు వారికి సూచించారు.పార్టీని బలోపేతం చేయడానికి నేతలు చొరవ తీసుకోవాలని బాబు సూచించారు.

40 నియోజకవర్గాల నేతలతో బాబు సమావేశం
పార్టీ బలహీనంగా ఉన్న 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆ 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఇంచార్జీలతో సమావేశాన్ని కానున్నట్టు చంద్రబాబునాయుడు ,ప్రకటించారు. ఈ సమావేశం తర్వాత కూడ మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరో వైపు పదవులు తీసుకొన్న నేతలు పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోకపోతే చర్యలు తప్పవని బాబు హెచ్చరించారు.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications