• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబుకు చిక్కులు: ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై చర్యలుంటాయా, జెసి కారణమా?

By Narsimha
|

అమరావతి: భూ కబ్జా కేసులో అరెస్టైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై ఆ పార్టీ చర్య తీసుకొంటోందా లేదా అనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ నారాయణరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అయితే దీపక్ రెడ్డిపై కూడ అదే తరహ చర్యలుంటాయా లేదా అనే చర్చ పార్టీవర్గాల్లో విన్పిస్తోంది.

హైద్రాబాద్ నగరంలో పలు భూ కబ్జా కేసుల్లో దీపక్ రెడ్డికి ప్రమేయం ఉందంటూ పోలీసులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై అనేక కేసులు కూడ ఆయనపై నమోదయ్యాయి.

ఈ కేసులకు సంబంధించే ఆయనను హైద్రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ రెడ్డితో పాటు న్యాయవాది శైలేష్ కుమార్ సక్సేనా మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

దీపక్ రెడ్డిపై తాజాగా మరో రెండు కేసులను కూడ పోలీసులు నమోదు చేశారు. నకిలీ పత్రాలను సృష్టించి భూములను కబ్జాలను చేయడంలో దీపక్ రెడ్డి గ్యాంగ్ అందెవేసిన చేయిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది.

పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో చంద్రబాబుకు తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. పార్టీని నష్టపర్చేలా నేతల వ్యవహరశైలి ఉంటుంది.ఈ విషయమై పలుమార్లు పార్టీ నేతలను హెచ్చరించినా వారిలో మార్పులు మాత్రం రావడం లేదు.

దీపక్ రెడ్డిపై టిడిపి చర్యలు తీసుకొంటుందా?

దీపక్ రెడ్డిపై టిడిపి చర్యలు తీసుకొంటుందా?

ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని తెలంగాణ పోలీసులు హైద్రాబాద్ లో అరెస్టుచేశారు. ఆయనను అరెస్టుచేసే విషయమై శాసనమండలి ఛైర్మెన్ కు కూడ పోలీసులు సమాచారం ఇచ్చారు.అయితే దీపక్ రెడ్డిని భూకబ్జాకేసులో పోలీసులు అరెస్టు చేయడంతో తెలుగుదేశం పార్టీ ఆయనపై చర్యలు తీసుకొంటోందా లేదా అనే ఆసక్తి నెలకొంది.

సిబిఐ దాడుల నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ నారాయణరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. దీపక్ రెడ్డి విషయంలో పార్టీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.అయితే ఈ విషయమై విపక్షాలు అధికారపార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి.అయితే పార్టీ దీపక్ రెడ్డిపై చర్య తీసుకోకపోతే జెసి బ్రదర్స్ ఒత్తిడే కారణమని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఆ నష్టం జరగకుండా ఉండాలంటే ఆయనపై చర్య తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

అనతికాలంలోనే దీపక్ రెడ్డికి పాపులారిటీ

అనతికాలంలోనే దీపక్ రెడ్డికి పాపులారిటీ

అనంతపురం జిల్లా రాయదుర్గం నుండి టిడిపి అభ్యర్థిగా దీపక్ రెడ్డి పోటీచేసిన సమయంలోనే ఆయనకు విశేషంగా ప్రచారం లభించింది. ఎన్నికల అఫిడవిట్ లో తనకు ఉన్న వేలాది కోట్ల రూపాయాలను ఆస్తులను ప్రకటించడంతో ఆయన బాగా పాపులరయ్యారు.2012 ఉప ఎన్నికలకు కొంతకాలం ముందే ఆయన టిడిపి తీర్థంపుచ్చుకొన్నారు. తనకు రూ.6,781 కోట్ల ఆస్తులున్నట్టుగా అఫిడవిట్ లో ప్రకటించారు.దీంతో ఆయన పేరు ప్రాచుర్యం పొందింది.

దీపక్ రెడ్డిపేరున ఉన్న ఆస్తులివే

దీపక్ రెడ్డిపేరున ఉన్న ఆస్తులివే

2012 ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టిడిపిలో చేరారు. ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను ఆయన ప్రకటించారు.తన వార్షికాదాయం రూ.3.27 లక్షలు, తన భార్య ఆదాయం రూ.1.98 లక్షలుగా ఉందన్నారు. తన పేరుతో రూ.4.59 కోట్ల చరాస్తులు, రూ.5.86 కోట్ల స్థిరాస్తులున్నాయని అఫడవిట్ లో చూపారు. తన భార్య పేరున రూ.1.76 కోట్ల చరాస్తులు, రూ.16.86 కోట్ల స్థిరాస్తులు, ఇతర వాటాలు ఉన్నట్టు చూపారు. ఇవి కాకుండా మరో రూ.6781.05 కోట్ల ఆస్తులున్నట్టు ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

నోటీసులిచ్చి భయపెట్టారు

నోటీసులిచ్చి భయపెట్టారు

ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అతడి అనుచరులు కోర్టు ద్వారా తరచూ నోటీసులు ఇచ్చి అందరిని భయబ్రాంతులకు గురిచేశారని బోజగుట్టకు చెందిన రవి మీడియాకు చెప్పారు. తమకు డబ్బులు చెల్లించి తమ వద్దే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ బెదిరించేవారన్నారు. నకిలీ పత్రాలను సృష్టించి భూ కబ్జాదారులు నానాహంగామా చేశారు. దీపక్ రెడ్డిని పోలీసులు అరెస్టుచేయడంతో స్థానికులు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra pradesh chief minister Chandrababu naidu what action take on MLC Deepak Reddy. Hyderabad police arrested Deepak Reddy for land scam cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more