12న ప్రధానితో చంద్రబాబు భేటీ: వీటిపైనే ప్రధాన చర్చ

Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ ఖరారైంది. జనవరి 12న చంద్రబాబు ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. శుక్రవారం ప్రధానితో టీడీపీ ఎంపీలు భేటీ అయిన సందర్భంగా ప్రధాని ఈ భేటీ ఖరారైనట్లు తెలిపినట్లు తెలిసింది.

కాగా, ప్రధానితో భేటీలో పోలవరం, విభజన అంశాలు, అసెంబ్లీ సీట్ల పెంపు మొదలగు విషయాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. అంతేగాక, కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

chandrababu naidu will meet PM on Jan 12th

అయితే, ఇటీవల ఏపీలో టీడీపీ, బీజేపీ ప్రతినిధులు, నేతల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో ప్రధానితో చంద్రబాబు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Andhra Pradesh CM Chandrababu Naidu will meet PM Narendra Modi on January 12th.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి