చంద్రబాబు ప్రతిపాదన వెనుక - బీజేపీ నుంచి వస్తున్న సిగ్నల్స్ ఏంటి..!?
టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం 2024 ఎన్నికలు. ఇప్పటికే జనసేనతో టీడీపీ పొత్తు ఖాయంగా భావిస్తున్న వేళ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్డీఏలో తిరిగి చేరటం పైన సంకేతాలు ఇచ్చారు.
గతంలో ఎన్డీఏ నుంచి బయటకు రావటం పైన కారణాలను వెల్లడించారు. 2014 తరహాలో తిరిగి జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ- బీజేపీ - జనసేన కలిసి పోటీ చేయాలని చంద్రబాబు తో సహా పవన్ కోరుకుంటున్నారు. చంద్రబాబు ఇప్పుడు సడన్ గా ఈ ప్రతిపాదన చేయటం వెనుక కారణాలేంటి, బీజేపీ నేతలు ఏం చెబుతున్నారు.

చంద్రబాబు పరోక్ష ప్రతిపాదన: తాజాగా ఒక జాతీయ టీవీ ఛానల్ చర్చలో ఎన్డీఏలో టీడీపీ తిరిగి చేరటం పైన స్పందించారు. చేరటానికి అవకాశం లేదని మాత్రం చెప్పలేదు. సమయానుకూలంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సమయంలో ప్రధాని మోదీ లక్ష్యంగా చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. నాడు మోదీని ఓడించటం కోసం కాంగ్రెస్ తోనూ చేతులు కలిపారు.
2019 ఎన్నికల ఫలితాల తరువాత జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య చేయలేదు. ఇప్పుడు ప్రధాని మోదీ నిర్ణయాలను సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేసారు. మోదీ దేశం కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. మోదీతో కలిసి దేశం కోసం పని చేయటానికి సిద్దమేనని పరోక్షంగా స్నేహ హస్తం అందించటానికి సిద్దమని చెప్పుకొచ్చారు. దీంతో, ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా చేసినవిగానే విశ్లేషణలు మొదలయ్యాయి.
జగన్ లక్ష్యంగా అడుగులు: చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత జగన్ బీజేపీ ముఖ్యులకు దగ్గరయ్యారు. ఎన్డీఏలో అధికారికంగా చేరకపోయినా ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కేంద్రానికి అవసరమైన సమయంలో మద్దతుగా నిలుస్తున్నారు. సీఎం జగన్ తో బీజేపీ ముఖ్యులు సత్సంబంధాలకు ప్రాధాన్య ఇస్తున్నారు. అప్పటి నుంచి సమయం కోసం చంద్రబాబు వేచి చూస్తున్నారు. 2024 ఎన్నికలు వ్యక్తిగతంగా చంద్రబాబు కు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇటు పవన్ కల్యాణ్ తో పొత్తు ఖాయమైన వేళ, అటు బీజేపీ తోనూ కలిసి వెళ్లాలనేది చంద్రబాబు వ్యూహం.
తాజాగా ఢిల్లీ యాత్రలో పవన్ కల్యాణ్ సైతం ఇదే ప్రతిపాదన బీజేపీ నేతల ముందు ఉంచారు. దీని ద్వారా అటు కేంద్రంలోని ముఖ్యుల నుంచి జగన్ కు మద్దతు లేకుండా చేయాలనేది చంద్రబాబు వ్యూహం. ఇందులో భాగంగానే పరోక్ష ప్రయత్నాలు కొనసాగిస్తున్నారనే ప్రచారం ఉంది. ఇప్పుడు నేరుగా ఎన్డీఏలో చేరిక పైన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. బీజేపీ నేతల స్పందనకు అనుగుణంగా అడుగులు వేసే క్రమంలో వ్యూహాత్మంకగా వ్యవహరిస్తున్నారు.

బీజేపీ ఏం చేయబోతోంది: బీజేపీ తమ నుంచి టీడీపీ దూరం అయ్యాక తిరిగి ఆ పార్టీతో జత కట్టేందుకు సిద్దంగా లేదని ఆ పార్టీ నేతలే చెబుతూ వచ్చారు. తెలంగాణ లో బీజేపీకి గెలుపు కీలకం కాగా, ఏపీలో అధికారం దక్కించుకోవటం టీడీపీకి అవసరం. అందులో భాగంగా తెలంగాణలో సహకరించేందుకు టీడీపీ సిద్దంగా ఉంది. కానీ, తెలంగాణ బీజేపీ నేతలు అందుకు సుముఖంగా లేరు. ఏపీలో మరోసారి టీడీపీతో కలిస్తే బీజేపీకి ఇక అవకాశం ఉండదనే వాదన ఉంది.
టీడీపీ ఈ సారి ఏపీలో అధికారంలోకి రాకపోతే ఇక భవిష్యత్ లో తమకు అవకాశం ఉంటుందనేది బీజేపీ నేతల అంచనా. కానీ, చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఇద్దరూ బీజేపీని ఒప్పించే ప్రయత్నాల్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు ఉండదని చెబుతున్నా, ప్రధాని మోదీ..అమిత్ షా నిర్ణయం కీలకం కావటంతో వారి నుంచి స్పష్టత వచ్చే వరకూ వేచి చూసే ధోరణితో చంద్రబాబు - పవన్ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రతిపాదన పైన బీజేపీ అధినాయకత్వం స్పందన కీలకం కానుంది.
-
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు ఫిక్స్, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications