ఆలస్యం జరుగుతోంది, ప్రత్యేక ప్యాకేజీ: అరుణ్ జైట్లీకి చంద్రబాబు లేఖ
అమరావతి: రాష్ట్రానికి గతంలో కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు.
విదేశీ సహాయ ప్రాజెక్ట్ కింద రాష్ట్రానికి నిధుల కేటాయించాలని కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 2015-16లో రూ.2,950 కోట్లు, 2016-17లో రూ.2,854 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు.

ఈఏపీ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్నాయని, ఈఏపీ కింద ప్రాజెక్టుల ఆమోదంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపాదనలకు ఆమోదం వెంటనే పొందేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications