నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తలపాగాతో బాబు, వెంకయ్య: ఒకరిపై ఒకరు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టు 13వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ‘వెంకయ్య నాయుడు పదమూడేళ్ల క్రితం ‘స్వర్ణ భారత్‌' అనే విత్తనాన్ని నాటారు. అది నేడు మహా వృక్షంగా మారింది. తన సేవాకార్యక్రమాలతో ఎందరినో సేదతీరుస్తుంది' అని అన్నారు.

సమాజంలో పేదలకు కావాల్సిన అన్ని సేవలను స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ అందిస్తోందని, విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ఇలాంటి ట్రస్టులు జిల్లాకు ఒకటి ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. నెల్లూరులో పుట్టిన వెంకయ్య, చిత్తూరులో పుట్టిన తాను ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని గుర్తు చేసుకున్నారు. వెంకయ్య నాయుడు సిద్ధాంతపరంగా నమ్మిన కట్టుబాట్ల కోసం పనిచేస్తూ ఎంతో పేరు గడించారని కొనియాడారు. అప్పటికి, ఇప్పటికి ఒకేపార్టీ, ఒకే జెండా అజెండాగా నడుస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా లేదంటూ రాజ్యసభలో ఒకే ఒక్కడుగా వెంకయ్య పోరాడారని బాబు గుర్తు చేశారు.

వైద్య, వ్యాపార తదితర రంగాల్లో ఉన్న తెలుగు వారు వారి సంపాదనలో 2 శాతం సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సమాజం అన్ని విధాలా అభివృద్ధి సాధించేందుకు నాలుగు ప్రాధాన్యాంశాలతో పాలన సాగిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. సమాజాభివృద్ధి కోసం నీరు - చెట్టు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, పేదరికంపై గెలుపు అన్న అంశాలతో పాలన సాగిస్తామన్నారు.

నవ్యాంధ్ర సాధకుడు: బాబుపై వెంకయ్య

క్రమశిక్షణ, సంప్రదాయాలతో నిండిన చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం రాష్ట్రం ఎంతో అదృష్టం చేసుకుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దేశం, సమాజం కోసం పని చేయాలని, సొంత ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌ సాధించే వ్యక్తి చంద్రబాబేనని పేర్కొంటూ రాష్ట్రాభివృద్ధికి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన వంతు సహకారం అందిస్తానని తేల్చి చెప్పారు.

చంద్రబాబు ఎంత వేగంగా అభివృద్ధి వైపు పయనిస్తారో.. తాము అంత సహకారం అందిస్తామని, అభివృద్ధిలో ఇద్దరు సీఎంలు పోటీ పడి ఢిల్లీలో తలెత్తుకునే విధంగా నడవాలన్నారు. జీఎంఆర్‌ గ్రూ ప్‌ చైర్మన్‌ గ్రంధి మల్లికార్జునరావు మాట్లాడుతూ.. స్వర్ణ భారత్‌ ట్రస్టు యూనివర్సిటీగా మారిందని, స్వర్ణాంధ్ర కాదు ఆనంద ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తామని సిఎం చంద్రబాబు చెప్పడం హర్షణీయమన్నారు. జివికె గ్రూప్‌ చైర్మన్‌ జీవీ కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాబు-వెంకయ్య

బాబు-వెంకయ్య

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం 10.30 గంటలకు స్వర్ణభారత్‌ ట్రస్టుకు విచ్చేశారు. అనంతరం స్వర్ణభారత్‌ ట్రస్టుకు విచ్చేసి శ్రీ శ్రీనివాస కల్యాణం, వరుణ యాగంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడతోపాటు పాల్గొన్నారు.

బాబు-వెంకయ్య

బాబు-వెంకయ్య


మొదట అక్షర విద్యాలయాన్ని సందర్శించి అక్కడే నీరు - చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు.

బాబు-వెంకయ్య

బాబు-వెంకయ్య

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

అలరించిన నృత్య ప్రదర్శన

అలరించిన నృత్య ప్రదర్శన

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టు 13వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.

అలరించిన నృత్య ప్రదర్శన

అలరించిన నృత్య ప్రదర్శన

ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. ‘వెంకయ్య నాయుడు పదమూడేళ్ల క్రితం ‘స్వర్ణ భారత్‌' అనే విత్తనాన్ని నాటారు. అది నేడు మహా వృక్షంగా మారింది. తన సేవాకార్యక్రమాలతో ఎందరినో సేదతీరుస్తుంది' అని అన్నారు.

బాబు-వెంకయ్య

బాబు-వెంకయ్య

సమాజంలో పేదలకు కావాల్సిన అన్ని సేవలను స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ అందిస్తోందని, విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ఇలాంటి ట్రస్టులు జిల్లాకు ఒకటి ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

బాబు-వెంకయ్య

బాబు-వెంకయ్య

క్రమశిక్షణ, సంప్రదాయాలతో నిండిన చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం రాష్ట్రం ఎంతో అదృష్టం చేసుకుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

అలరించిన నృత్య ప్రదర్శన

అలరించిన నృత్య ప్రదర్శన

ప్రతి ఒక్కరూ దేశం, సమాజం కోసం పని చేయాలని, సొంత ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

బాబు-వెంకయ్య

బాబు-వెంకయ్య

నవ్యాంధ్ర ప్రదేశ్‌ సాధించే వ్యక్తి చంద్రబాబేనని పేర్కొంటూ రాష్ట్రాభివృద్ధికి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన వంతు సహకారం అందిస్తానని తేల్చి చెప్పారు.

బాబు-వెంకయ్య

బాబు-వెంకయ్య

విభజన సరికాదని, అన్యాయం సరిదిద్దాలన్న ఆలోచనతోనే తాను నడుస్తున్నానని తెలిపారు. తెలంగాణలో ఉన్న తెలుగువారు కూడా మనవారేనని వెంకయ్య పేర్కొన్నారు.

బాబు-వెంకయ్య

బాబు-వెంకయ్య

నెల్లూరులో పుట్టిన వెంకయ్య, చిత్తూరులో పుట్టిన తాను ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

బాబు-వెంకయ్య

బాబు-వెంకయ్య

వెంకయ్య నాయుడు సిద్ధాంతపరంగా నమ్మిన కట్టుబాట్ల కోసం పనిచేస్తూ ఎంతో పేరు గడించారని కొనియాడారు.

వెంకయ్య

వెంకయ్య

అప్పటికి, ఇప్పటికి ఒకేపార్టీ, ఒకే జెండా అజెండాగా నడుస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా లేదంటూ రాజ్యసభలో ఒకే ఒక్కడుగా వెంకయ్య పోరాడారని బాబు గుర్తు చేశారు.

బాబు-వెంకయ్య

బాబు-వెంకయ్య

వైద్య, వ్యాపార తదితర రంగాల్లో ఉన్న తెలుగు వారు వారి సంపాదనలో 2 శాతం సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

సమాజం అన్ని విధాలా అభివృద్ధి సాధించేందుకు నాలుగు ప్రాధాన్యాంశాలతో పాలన సాగిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. సమాజాభివృద్ధి కోసం నీరు - చెట్టు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, పేదరికంపై గెలుపు అన్న అంశాలతో పాలన సాగిస్తామన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naiud and Union Minister Venkaiah Naidu on Sunday visited Akshara vidyalaya & Swarna Bharathi Trust in Nollore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X