అన్ని వైపుల నుంచీ దాడి: చంద్రబాబు తురుపుముక్క పవన్ కళ్యాణ్?

విజయవాడ: ఎపి రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు తిరుగు ఉండదని భావించారు. కానీ, ఆ తర్వాతే సమస్యలు పెరిగాయి. అన్ని వైపుల నుంచి చంద్రబాబుపై, ఆయన ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు రగిలిపోతుండగా, మిత్రపక్షం బిజెపి నాయకుల నుంచి తీవ్రమైన వ్యాఖ్యలు వస్తున్నాయి.

అదే సమయంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రాంతీయ చిచ్చులను రగిలించేందుకు నాయకులు సిద్ధపడుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నేతలు చంద్రబాబుపై తిరుగుబాటు ప్రకటించేందుకు సిద్ధపడుతున్నారు. మాజీ మంత్రి హరిరామజోగయ్య ఆత్మకథ వెలువడినప్పటి నుంచి ఆ వర్గానికి చెందిన నాయకులు ఏకమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

కాపు సామాజిక వర్గానికే చెందిన బిజెపి నేత కన్నా లక్ష్మినారాయణ మొదటి నుంచీ చంద్రబాబుకు బద్ధ విరోధి. ప్రస్తుత అవకాశాన్ని ఆయన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కత్తులు నూరేందుకు సిద్ధపడ్డారు. అందరి కన్నా ఎక్కువగా బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు టిడిపిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన బిజెపి నాయకులు కావూరి సాంబశివరావు టిడిపికి వ్యతిరేకంగా బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు.

దగ్గుబాటి పురంధేశ్వరి కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పడానికి వీలు కలుగుతోంది. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన హరిరామ జోగయ్య పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించి, ఆమె ఓ చేయి వేశారు. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్‌ను తురుపు ముక్కగా వాడాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

Chandrababu needs Pawan Kalyan to face troubles?

బిజెపికి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్ మధ్యవర్తిత్వం నెరిపి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీకి ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. కామినేని శ్రీనివాస్ ఈ వ్యవహారం నెరపడానికి బిజెపి అధిష్టానం నుంచి అనుమతి ఉందా అనేది కూడా చర్చనీయాంశంగానే మారింది. ఓ వైపు తన నాయకులతో చంద్రబాబుపై విమర్శలు చేయిస్తూ మరో వైపు తాము స్నేహాన్నే కోరుతున్నామని చెప్పడానికి ఈ పని చేయిస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లడడానికి పవన్ కళ్యాణ్‌ను తీసుకుని వెళ్లాలని చంద్రబాబును యోచిస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు భూములు ఇవ్వని రైతులకు నచ్చజెప్పడానికి కూడా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అవసరంగా మారారు. వీటన్నింటినీ పక్కన పెడితే కాపు సామాజిక వర్గాన్ని నిలువరించడానికి పవన్ కళ్యాణ్ ఆయుధంగా పనికి వస్తారనే అభిప్రాయం కూడా ఉంది.

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు వల్లనే చంద్రబాబు విజయం సాధించారనే అంచనా ఉంది. కోస్తాంధ్రలో పవన్ కళ్యాణ్ కారణంగా కాపు, కమ్మ సామాజిక వర్గాలు ఏకం కావడం వల్లనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓడిపోయి బిజెపి, తెలుగుదేశ కూటమి గెలిచిందనేది అందరు వేసిన అంచనానే. ఇప్పుడు కాపు సామాజిక వర్గం వ్యతిరేకంగా మారితే చంద్రబాబుకు సమస్య ఎదురవుతుందనడంలో సందేహం లేదు. కాపు సామాజిక వర్గం వ్యతిరేకను తగ్గించడానికి లేదా మొత్తంగానే చల్లబరచడానికి పవన్ కళ్యాణ్ ఆయుధంగా పనికి రావచ్చుననేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.

ఇకపోతే, రాయలసీమ ప్రత్యేక ఉద్యమం కూడా పాదులు వేసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. దానికి కూడా పవన్ కళ్యాణ్ విరుగుడుగా పనికి వచ్చే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. ప్రాంతీయ ఉద్యమాలు ముందుకు వస్తే చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్‌గా మారే ప్రమాదం ఉంది. తెలుగు జాతి కలిసి ఉండాలనే నినాదంతో పవన్ కళ్యాణ్ ముందుకు వస్తే ఫలితం ఉంటుందని ఆయన అనుకుంటున్నారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఆదరణ, ఇమేజ్ అన్ని సమస్యలకు ఏదో మేరకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు.

అందుకే, పవన్ కళ్యాణ్‌తో భేటీకి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు. గురువారంనాటి భేటీకి ఏ విధమైన అడ్డంకులు లేకుండా చంద్రబాబు చూసుకున్నట్లు చెబుతున్నారు. ఈ భేటీని ఆయన కీలకంగా భావించే అన్ని ఏర్పాట్లు కూడా చేశారని అంటున్నారు. రెగ్యూలర్ ఫ్లయిట్‌లో పవన్ కళ్యాణ్ కోసం టికెట్ బుక్ చేయడమే కాకుండా ఆయన కోసం ప్రత్యేకమైన విమానాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతగా ఆయన పవన్ కళ్యాణ్ భేటీకి ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+