'బాబు విడ్డూరం', ఎంపీలను అంటే బాబును అన్నట్టు కాదా?,
విజయవాడ : సొంత పార్టీ వ్యక్తిని అవతలి వ్యక్తి టార్గెట్ చేస్తున్నప్పుడు.. విమర్శలను తిప్పికొట్టడంలో పార్టీ నాయకుడు ముందుంటాడు. అయితే ఏపీ అధికార పార్టీ పాలిటిక్స్ లో మాత్రం ఈ సీన్ పూర్తిగా రివర్స్. టీడీపీ ఎంపీలను పవన్ అన్నేసి మాటలంటే.. చంద్రబాబు మాత్రం 'నన్నయితే ఏమి అనలేదుగా' అంటూ స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మొన్నటి తిరుపతి సభలో టీడీపీ ఎంపీలు మురళీ మోహన్, అశోక గజపతిరాజు, కేశినేని నాని మరియు మంత్రి నారాయణ లాంటి నేతలను పవన్ కడిగిపారేసిన సంగతి తెలిసిందే. హిందీ నేర్చుకోండంటూ ఎంపీలందరికీ హితవు పలికిన పవన్.. ఎంపీలంతా ఢిల్లీలో 'సార్.. సార్..' అంటూ ఏపీ ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెడుతున్నారని వ్యంగ్యంగా చురకలంటించారు. ఈ విషయంలో ఎంపీలకు సిగ్గు, శరం లేదా? అంటూ సూటిగానే ప్రశ్నించారు పవన్.

ఓవైపు పవన్ వ్యాఖ్యలపై ఎంపీలంతా అగ్గి మీద గుగ్గిలం అవుతుంటే.. చంద్రబాబు మాత్రం తననేమి అనలేదు కదా అంటూ సంతృప్తి చెందడం సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తిని రాజేసేదిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ వ్యాఖ్యలను ఖండించపోగా.. తనను టార్గెట్ చేయకపోవడం పట్ల చంద్రబాబు సంతోషంగా ఉండడం విడ్డూరంగా ఉందన్న వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications