హోదా ఇవ్వమని కేంద్రం చెప్పింది, మీరే వెళ్లాలి: తమ్ముళ్లతో బాబు

అమరావతి: సాంకేతిక సమస్య కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నట్లు కేంద్రం చెప్పిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు చెప్పారు. తాము రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎన్డీయేతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.

నాయకత్వంపై కార్యకర్తలు ప్రజలకు నమ్మకం కలిగించాలని, ప్రజల్లోకి నేరుగా వెళ్లేది కార్యకర్తలే అని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతులకు చంద్రబాబు హాజరయ్యారు.

మిమ్మల్ని సీఎంగా చూడాలి, కానీ వెన్నుపోటుతో: జగన్‌కు విశాఖ నేత షాక్

ఈ సందర్భంగా మాట్లాడారు. పార్టీ పెట్టినప్పటి నుంచి శిక్షణా తరగతులకు ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. రియల్ టైం గవర్నెన్సుతో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. వినూత్న ఫలితాలు రాబట్టేందుకు ప్రణాళికలు అమలు చేయాలన్నారు.

Chandrababu on Special Status and package

భవిష్యత్‌లో ఎలా ముందుకెళ్లాలో ప్రణాళికలు రూపొందించాలన్నారు. విభజన అనంతరం ప్రజల్లో స్తబ్ధత నెలకొందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీయేతో కలిసి పని చేస్తున్నామన్నారు. విభజన చట్టంలో కొన్ని అంశాలపై స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. మరికొన్నింటిని పరిశీలిస్తామని చెప్పారు.

ప్రత్యేక హోదా వల్ల వచ్చే అన్ని ప్రయోజనాలతో ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందన్నారు. ఇప్పటికే కొన్ని కేంద్ర సంస్థలు వచ్చాయని, మరిన్ని రావాల్సి ఉందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన సంస్థలు పూర్తి కావాలంటే రూ.10వేల కోట్లు కావాలన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా 100శాతం నిధులు ఇస్తామని కేంద్రం అంగీకరించిందన్నారు. పోలవరం పనులను వేగవంతం చేశామన్నారు. పోలవరంపై ముంపు ప్రాంతాలను ఏపీలో కలుపుతూ తొలి కేబినెట్‌ సమావేశంలోనే కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+