జగన్ పార్టీ రాద్ధాంతం, నాలుగేళ్లలో పోలవరం: చంద్రబాబు
కర్నూలు: కరువు ప్రాంతమైన రాయలసీమకు నీరు అందించడానికే పట్టిసీమ ప్రాజెక్ట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. సముద్రంలో కలుస్తున్న వృథా నీటిని తరలిస్తామంటే జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
సాగునీరుకు పోతిరెడ్డి ద్వారా ఎస్ఆర్ఎంసీ కాలువ విస్తరణ పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. సిద్ధాపురం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను త్వరలో పూర్తి చేస్తామని ఆయనచంద్రబాబు స్పష్టం

బుధవారం కర్నూలు జిల్లా బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద రైతులతో చంద్రబాబు మాట్లాడారు. పోలవరానికి జాతీయ హోదా కల్పించినా పూర్తి చేయడానికి 4 ఏళ్లు పడుతుందని చెప్పారు.
గాలేరు నగరి కాలువ నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications