నంద్యాలలో టిడిపికి ఆందోళనలివే, జగన్ వస్తే మంచిదే! అఖిలప్రియకు ఆదేశాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: భూమా బ్రహ్మానంద రెడ్డి రాజకీయాలకు కొత్త కాబట్టి, ప్రచారానికి వెంట వెళ్లాలని మంత్రి అఖిలప్రియకు అధిష్టానం సూచించింది. సీఎం చంద్రబాబు ప్రతి రోజు గంట పాటు నంద్యాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

జగన్! నన్నెందుకు కాల్చాలి, పవన్‌పై జాగ్రత్త: బాబు, సర్వేలో వైసిపికి 30 సీట్లే

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపుపై టిడిపి, వైసిపిలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ లోలోపల వారు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అధికార పార్టీ గెలుపుకు కొంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ నంద్యాలలో ఆ పరిస్థితి లేదు.

 ఓటు టిడిపికి వేయాలా, వైసిపికి వేయాలా?

ఓటు టిడిపికి వేయాలా, వైసిపికి వేయాలా?

టిడిపి, వైసిపి పోటాపోటీగా ఉన్నాయి. వైయస్ జగన్ కాల్చివేత వ్యాఖ్యలు తటస్థ ఓటర్లలో కొంత ఆలోచన చేసేలా చేశాయని అంటున్నారు. రూ.1200 కోట్లతో జరుగుతోన్న అభివృద్ధిని కొనసాగించాలంటే టిడిపి అభ్యర్థిని గెలిపించాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో ఉప ఎన్నికలు వచ్చినందువల్లే అభివృద్ధి జరుగుతోందని, కాబట్టి టిడిపిని నమ్మే పరిస్థితి లేదని మరికొందరు భావిస్తున్నారని అంటున్నారు.

YS Jagan Warns MLA Roja | Oneindia Telugu
నంద్యాలలో 25 మంది ఎమ్మెల్యేలు

నంద్యాలలో 25 మంది ఎమ్మెల్యేలు

భూమా గెలుపు కోసం టిడిపి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను నంద్యాల పంపించింది. వీరంతా గ్రామాల్లో మకాం వేశారు. వీరితో పాటు చంద్రబాబు సర్వే బృందాలు కూడా పర్యటిస్తున్నాయి. వీరి నుంచి వచ్చే నివేదికలు చంద్రబాబుకు అందుతున్నాయి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటున్నారు.

చాలామంది పైపైనే తిరుగుతున్నారా?

చాలామంది పైపైనే తిరుగుతున్నారా?

25 మంది ఎమ్మెల్యేలు వెళ్లినప్పటికీ వారంతా పైపైనే తిరుగుతున్నారనే ఆందోళన టిడిపిలో నెలకొంది. వీరు చాలామంది సాయంత్రానికి వచ్చి ఏదో అటెండెన్స్ వేసుకొని వెళ్తున్నారని సమాచారం.

అంటీముట్టనట్లుగా ఏవీ సుబ్బారెడ్డి

అంటీముట్టనట్లుగా ఏవీ సుబ్బారెడ్డి

కొందరు పార్టీ నేతలతో పాటు భూమా నాగిరెడ్డికి సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. భూమా కుటుంబ సభ్యులు ఆయనను అంతగా ఆదరించడం లేదని కూడా ప్రచారం సాగుతోంది. ఇది టిడిపిలో ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిణామాలు టిడిపికి ఆందోళన కలిగిస్తున్నాయని తెలుస్తోంది.

అఖిలకు సూచనలు

అఖిలకు సూచనలు

భూమా బ్రహ్మానంద రెడ్డి రాజకీయాలకు కొత్త కాబట్టి ఆయన వెంట ప్రచారానికి వెళ్లాల్సిందేనని అఖిలప్రియకు అధిష్టానం చెప్పిందని తెలుస్తోంది. ఇంటింటికి తిరగాలని, సూచించింది. ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుడంా కోడ్‌ వర్తించని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధిష్టానం చెప్పింది.

వరుసగా జగన్ టూర్

వరుసగా జగన్ టూర్

ఈ నెల తొమ్మిది నుంచి 21 వరకు వైసిపి అధినేత జగన్‌ నంద్యాలలో మకాం వేయనున్నారు. అది కూడా మనకు మంచిదేనని టిడిపి నేతలు విశ్లేషిస్తున్నారట. దీనివల్ల తమ పార్టీ క్యాడర్‌లో కసి పెరుగుతుందని, నాయకులు మరింత కష్టపడతారని చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu ordered Minister AKhila Priya over Nandyal byoll campaign.
Please Wait while comments are loading...