మరుగుదొడ్డిపై పాట వినిపించిన చంద్రబాబు

నెల్లూరు/హైదరాబాద్‌: మరుగుదొడ్డిపై అవగాహన కల్పించేందుకు తమ ప్రభుత్వం ఓ పాటను రూపొందించిందని.. ఆ పాట ఇప్పుడు మీరంతా వినాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ ఆవరణలో జన్మభూమి-మా ఊరులో సిఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరుదొడ్డిపై రూపొందించిన పాటను అక్కడి ప్రజలకు వినిపించాలని అధికారులను ఆదేశించడంతో వారు ఆ పాటను వినిపించారు.

స్వర్ణగ్రామాల రూపకల్పనకు ప్రజలు ముందుకు రావాలని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కృష్ణపట్నం ప్లాంట్‌ విద్యుత్‌కు సంబంధించి పీపీఏ లేదన్న ఆయన మొత్తం విద్యుత్‌ను ఏపీ వినియోగించవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో ఏపీతో పాటు తెలంగాణకు కూడా న్యాయం చేస్తానని బాబు హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీకి ఆర్‌బీఐ అనుమతించలేదని, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించలేదని అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే నిర్ణయించామని సీఎం అన్నారు.

అక్టోబర్‌లోనే 20 శాతం మాఫీ డబ్బును బ్యాంకుల్లో వేస్తామని, మిగతా 80 శాతం రుణానికి 10 శాతం వడ్డీతో నాలుగు విడతల్లో చెల్లిస్తామని చంద్రబాబు వెల్లడించారు. రైతులు, పేదలు తనకు రెండు కళ్లు అన్న బాబు పేదరికంపై గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. స్వర్ణగ్రామం నుంచి స్వర్ణ రాష్ట్రం దిశగా ముందుకెళ్దామని చంద్రబాబు పేర్కొన్నారు.

Janmabhumi

కామన్వెల్త్‌ పార్లమెంటరీ సదస్సులో పాల్గొన్నా: కోడెల

హైదరాబాద్‌: కెమెరాన్‌లో అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో జరిగిన 60వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ సదస్సులో పాల్గొన్నానని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ చెప్పారు. ఆయన పార్లమెంటరీ సదస్సులో మాట్లాడిన పలు విషయాలను శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడించారు. దేశాభివృద్ధిలో యువత పాత్రపై మాట్లాడే అవకాశం దక్కిందని అన్నారు. ‘యువత అభివృద్ధిలో పార్లమెంట్‌-ఎడ్యుకేషన్‌ పాత్ర' అనే అంశంపై మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

భారత దేశ జనాభాలో 60 శాతం 40 ఏళ్లలోపు వయసు వారు ఉన్నారని కోడెల శివప్రసాద్‌ అన్నారు. వీరంతా జాతికి, దేశ ప్రగతికి ఉపయోగపడతారని ఆయన అన్నారు. ఒకేషనల్‌, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అవసరమని, పిల్లలకు చదువు అనేది అలంకారం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపాధి చేకూర్చడంతో పాటు దేశాభివృద్ధికి ఉపయోగపడేదిశగా ఉండాలని చెప్పినట్లు కోడెల తెలిపారు.

యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని, యువత రాజకీయాల్లో చురుగ్గా ఉండాలని కోడెల అన్నారు. తన పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదని ఆయన అన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా పర్యటనలు చేయలేదని, ఇది ప్రతి ఏడాది జరిగే కార్యక్రమమేనని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+