ఎమ్మెల్యే తంగిరాలకు చంద్రబాబు నివాళి (పిక్చర్స్)
విజయవాడ: గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావు భౌతిక కాయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం సందర్శించి నివాళులు అర్పించారు. తంగిరాల మృతి ఒక్క కృష్ణా జిల్లా వాసులకే కాకుండా, తమ పార్టీకి కూడా తీరని లోటని ఆయన అన్నారు.
తంగిరాల మరణం తనను ఎంతో కలచివేసిందన్నారు. ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తంగిరాల కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. దేవినేని కుటుంబం తర్వాత నందిగామ నియోజకవర్గానికి తంగిరాల పేరు తెచ్చారని బాబు గుర్తు చేశారు.
అందరితో కలివిడిగా ఉండే తంగిరాల మన మద్య లేకపోవడం పార్టీకి తీరని లోటు అని, పదవులను ఆశించకుండా పని చేసిన వ్యక్తి తంగిరాలని చంద్రబాబు సంతాపం ప్రకటించారు. చంద్రబాబు వెంట పార్టీ నేతలు గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీ, మండలి బుద్ధ ప్రసాద్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తదితరులు ఉన్నారు.

తంగిరాలకు బాబు నివాళి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం తంగిరాల భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

ఏడ్చేశారు ఇలా..
నందిగామ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకర రావు భౌతిక కాయానికి తెలుగుదేశం పార్టీ నేతలు నివాళులు అర్పించారు.

తీరని లోటు అని బాబు
నందిగామ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకర రావు మృతి కృష్ణా జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా పార్టీకి కూడా తీరని లోటు అని చంద్రబాబు అన్నారు.

ప్రజల నివాళులు...
తమ నేత తంగిరాల ప్రభాకర రావును చివరిసారి చూడడానికి అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఇలా క్యూ కట్టారు.

తంగిరాల భౌతిక కాయం
నందిగామ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకర రావు గుండెపోటుతో ఆకస్మికంగా మృత్యువాత పడ్డారు. ఆయన భౌతిక కాయం ఇలా..












Click it and Unblock the Notifications