Game Changer: ఏపీకి మరో గేమ్ ఛేంజర్- జెట్ స్పీడ్ తో రెడీ చేస్తున్న చంద్రబాబు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలక నిర్ణయాలన్నీ వేగంగా తీసుకుంటున్న సీఎం చంద్రబాబు మరో గేమ్ ఛేజర్ ప్రాజెక్టు సిద్దం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించి కృష్ణా-గోదావరి నదుల్ని అనుసంధానం చేసిన చంద్రబాబు..ఇప్పుడు మరో నదుల సంధానం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. అంతే కాదు మూడేళ్లలో దీన్ని పూర్తి చేసి రాష్ట్రంలో లెక్కల్ని పూర్తిగా మార్చబోతున్నారు.
రాయలసీమలో ఉన్న బనకచర్లకు పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల్ని తరలించడం ద్వారా కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్దమవుతున్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టు కాలువ ద్వారా పట్టిసీమ ప్రాజెక్టుకు నీళ్ళు ఇచ్చి అక్కడి నుంచి కృష్ణానదిలోకి దాన్ని ఎత్తిపోసేల చేసిన చంద్రబాబు నదుల అనుసంధానానికి తెరదీశారు. ఇప్పుడు అదే పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణానదిపై ఆధారపడిన బనకచర్లకు నీళ్లు ఇవ్వడం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయబోతున్నారు.

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును హైబ్రిడ్ విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తద్వారా మూడేళ్లలో రాయలసీమకు గోదావరి జలాలు ఇవ్వబోతున్నారు. ఈ గేమ్ ఛేంజర్ ప్రాజెక్టు డీపీఆర్ ను మూడు నెలల్లో సిద్దం చేయనున్నారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి హైబ్రిడ్ విధానంలో పనులు చేపడతారు. గోదావరి జలాలను బనకచర్లకు తరలించి తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశయమని, ఇది పూర్తైతే ఏపీకి గేమ్ ఛేంబర్ అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
గోదావరి జలాలను బనకచర్లకు తరలించే ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు తాజాగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌లో పది సూత్రాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామని, ఎన్టీఆర్ సీఎం అయ్యేవరకూ సీమకు నీళ్లివ్వాలనే ఆలోచన ఎవరూ చేయలేదని గుర్తుచేశారు. అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో శ్రీశైలం నుంచి తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు కెనాల్ నీరిచ్చారని, ఇప్పుడు తాను నదుల అనుసంధానం కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే 3వేల టీఎంసీల నీటిలో 300టీఎంసీల నీటిని ఒడిసిపట్టడమే లక్ష్యంగా బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు. పోలవరం నుంచి కృష్ణా నదికి నీరు మళ్లించడం మొదటి దశ కాగా, రెండోదశలో బొల్లాపల్లి జలాశయం నిర్మించి నీళ్లు తరలిస్తామని తెలిపారు. మూడోదశలో బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్లకు నీటిని మళ్లిస్తామన్నారు. గోదావరి నీటిని కృష్ణా నదికి దాని నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు తరలిస్తామని చంద్రబాబు వెల్లడించారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications