భువనేశ్వరికి గుర్తింపు గర్వకారణం: చంద్రబాబు
హైదరాబాద్: దేశంలోని శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో తన సతీమణి నారా భువనేశ్వరి ఒకరిగా నిలవడం ఎంతో గర్వకారణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్టర్‌లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తన తల్లి భువనేశ్వరి దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో చోటు చేసుకోవడం పట్ల నారా లోకేష్ కూడా ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు. ఇది తమకు గర్వకారణమని ఆయన అన్నారు.
భారత వాణిజ్యరంగంలో అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో రాష్ట్రానికి చెందిన అపోలో ఆస్పత్రి ఎండి ప్రీతిరెడ్డి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఉన్నారు. ప్రస్తుతం భువనేశ్వరి పలు సంస్థల బోర్డుల్లో సభ్యులుగా ఉన్నారు. హెరిటేజ్ అభివృద్ధికి భువనేశ్వరి ఎంతో కృషి చేశారని చంద్రబాబు ప్రశంసించారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి దేశంలోని శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో చోటు లభించింది. తొలిసారిగా భువనేశ్వరి ఈ జాబితాలో స్థానం దక్కించుకోవడం విశేషం. పలు కంపెనీల బోర్డుల్లో డైరెక్టరుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న భువనేశ్వరి హెరిటేజ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
కాగా 2012-13లో హెరిటేజ్ ఫుడ్స్ వార్షిక టర్నోవర్ రూ. 1606 కోట్లను అధిగమించింది. 2013 సంవత్సరానికి 50 మంది శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తలతో కూడిన జాబితాను ఫార్చ్యూన్ మేగజైన్ విడుదల చేసింది. ఈ జాబితాలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతారెడ్డి నాలుగో స్థానంలో నిలిచారు.












Click it and Unblock the Notifications