Chandrababu: చంద్రబాబు రెండో సంతకం ఖరారు- దేనిపైనో తెలుసా ?
ఏపీలో ఎన్నికల ప్రచారం మరో 10 రోజుల్లో ముగియనుంది. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. మరోవైపు తాజాగా విపక్షాలు తెరపైకి తెచ్చిన ఏపీ భూహక్కు చట్టం వివాదం ప్రచారంలో కీలకంగా మారింది. వైసీపీ ప్రభుత్వం తిరిగి వస్తే మీ భూములన్నీ లాక్కుంటారంటూ ఎన్డీయే కూటమి పార్టీలు జనంలోకి వెళ్లి ప్రచారం చేస్తున్నాయి. దీంతో వైసీపీ కూడా డిఫెన్స్ లో పడుతోంది. ఇదే క్రమంలో విపక్ష నేత చంద్రబాబు తాజాగా మ్యానిఫెస్టోలోనూ కీలక హామీ ఇచ్చారు.
తాము తిరిగి అదికారంలోకి వస్తే వివాదాస్పద భూహక్కు చట్టం రద్దు చేస్తామని ఎన్డీయే కూటమి మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. దీనికి కొనసాగింపుగా ఇవాళ చంద్రబాబు మరింత స్పష్టత ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే రెండో సంతకం భూహక్కు చట్టం రద్దుపైనే చేస్తామని ప్రకటించారు. చీరాలలో జరిగిన ఎన్నికల సభలో ఆయన ఈ హామీ ఇచ్చారు. ఇప్పటికే అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపై చేస్తామని హామీ ఇచ్చారు.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చి జగన్ సర్కార్ ప్రజల భూములు లాక్కుంటోందని చంద్రబాబు ఇవాళ ఆరోపించారు. ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటన్నారు. ప్రజల ఆస్తులు కొట్టేయాలని చూడటం అన్యాయం అన్నారు. ఎకరాలకు ఎకరాలు రికార్డులు తారుమారు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఆత్మహత్యలు కూడా ప్రారంభమయ్యాయని చంద్రబాబు విమర్శించారు. ఒంటిమిట్టలో రికార్డులు తారుమారు చేస్తే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అందుకే తాము అధికారంలోకి రాగానే రెండో సంతకం భూహక్కు చట్టంపై చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications