వాలంటీర్లకు చంద్రబాబు ఉగాది గుడ్ న్యూస్..! 5 వేలు కాదు 10 వేలు..
ఏపీలో నాలుగున్నరేళ్లుగా సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందిస్తున్న వాలంటీర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల వేళ కీలక హామీ ఇచ్చారు. వాలంటీర్లకు ఎన్డీయే కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ వ్యతిరేకమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉగాది సందర్భంగా వారికి చంద్రబాబు ఈ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ఈ హామీ ఇచ్చారు.
వాలంటీర్లను రాజీనామా చేసి పార్టీకి పనిచేయమని వైసీపీ నేతలు చెబుతున్నారని చంద్రబాబు వెల్లడించారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి తరపున హామీ ఇచ్చారు. వాలంటీర్లకు రాబోయే రోజుల్లో 10వేలు పారితోషికం ఇచ్చే బాధ్యత తమదే అన్నారు. 2,66,000 మంది వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు...వాలంటీర్లు జగన్ ను నమ్మి మోసపోవద్దన్నారు.

రాష్ట్రంలో వాలంటీర్లను పెన్షన్ సహా మరే ఇతర సంక్షేమ పథకాల పంపిణీలోనూ వాడొద్దని ఈసీ ఆదేశాలు ఇచ్చాక ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ సాగింది. వాలంటీర్లను ఎన్నికల విధులతో పాటు పథకాల పంపిణీకీ ఈసీ దూరం చేయడం వెనుక టీడీపీ, బీజేపీ, జనసేన పాత్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తుున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లను బుజ్జగించేందుకు చంద్రబాబు కూటమి తరఫున ఈ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వాలంటీర్లకు ఉగాది రోజు తీపికబురు చెబుతున్నా..
— iTDP Official (@iTDP_Official) April 9, 2024
అధికారంలోకి రాగానే రూ.5,000 కాదు.. రూ.10,000 పారితోషికం ఇస్తాం ! #NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/9ntXNFRSqC












Click it and Unblock the Notifications