వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెంటిమెంట్‌పై ఆ రోజు రాష్ట్రమే ఇచ్చారు: కేంద్రంపై చంద్రబాబు భగ్గు

By Pratap
|
Google Oneindia TeluguNews

అమరావతి: తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భగ్గుమన్నారు. ఆయన మంగళవారం ఉదయం తమ పార్టీ పార్లమెంటు సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

పార్టీ ఎంపీలకు ఆయన మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని ఆయన వారికి సూచించారు. ప్రజల గొంత పార్లమెంటులో ప్రతిబింబించాలని ఆయన అన్నారు.

 కేంద్రం ఉదాసీనత భావ్యం కాదు...

కేంద్రం ఉదాసీనత భావ్యం కాదు...

రాష్ట్రానికి చెందిన 5 కోట్ల మంది ప్రల మనోభావాలపై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించడం సరి కాదని చంద్రబాబు అన్నారు. మన పోరాటం నిర్మాణాత్మకంగానే జరగాలని, అదే సమయంలో అభివృద్ధి స్తంభించకూడదని ఆయన అన్నారు. మన హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

Recommended Video

మోడీపై విశ్వాసం ఉంటే రాజీనామాలు, అవిశ్వాసం ఎందుకు ?
హోదా మా హక్కు అని చంద్రబాబు

హోదా మా హక్కు అని చంద్రబాబు

ప్రత్యేక హోదా తమ హక్కు అని చంద్రబాబు అన్నారు. ఎందుకు ఇవ్వరని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎంపీలు పోరాటం చేయాలని ఆయన సూచించారు.

 రాష్ట్రంలో కొవ్వొత్తుల ర్యాలీ...

రాష్ట్రంలో కొవ్వొత్తుల ర్యాలీ...

విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ పార్లమెంటు వేదికగా పార్టీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ, మండలి చీఫ్ విప్‌లు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. పార్లమెంటులో ఇతర పార్టీల ఎంపీల మద్దతు కూడా తీసుకోవాలని సూచింంచారు.

సెంటిమెంట్‌కు ఆ రోజు రాష్ట్రమే ఇచ్చారు...

సెంటిమెంట్‌కు ఆ రోజు రాష్ట్రమే ఇచ్చారు...

సెంటిమెంట్‌కు ఆ రోజు రాష్ట్రమే ఇచ్చారని చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ఈ రోరజు సెంటిమెంటు చూసి కూడా డబ్బులు ఇవ్వలేమంటారా, ఇదేం న్యాయమని ఆయన ప్రశ్నింంచారు. తమ డిమాండ్లు హేతుబద్దమైనవని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడగడం నిర్హేహతుకమా అని కూడా ఆయన ప్రశ్నించారు.

English summary
Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chnadrababu Naidu expressed anguish at PM Narendra Modi's union government for not granting special category status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X