ఎపి భారత్‌లో భాగం కాదా, అమరావతి వద్దా: కేంద్రాన్ని ఏకేసిన చంద్రబాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: విభజన హామీలు, ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నామని, వ్యక్తిగతంగా ఏమీ అడగడం లేదని అన్నారు.

పోలీసు అకాడమీ, సిసిఎంబీ వంటి సంస్థలను రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగం కాదా అని మండిపడ్డారు. విభజన హామీల్లో కీలకమైన విశాఖ రైల్వే జోన్, కడపలో ఉక్క కర్మాగారం వంటివాటిని కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శింంచారు.

వాటికి మోకాలడ్డుతున్నారు...

వాటికి మోకాలడ్డుతున్నారు...

అమరావతి, విశాఖ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు మోకాలడ్డుతున్నారని చంద్రబాబు విమర్శించారు.ఎపికి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వరో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై అన్ని యూసీలు సక్రమంగానే పంపించామని, రాజధాని నిధులకు సంబంధించిన యూసీలు కూడా పంపించామని, తాము పంపిన అన్నియూసీలను నీతి ఆయోగ్ ధ్రువీకరించిందని చెప్పారు.

అడిగితే బురద చల్లుతున్నారు...

అడిగితే బురద చల్లుతున్నారు...

ఎపికి శానససభా స్థానాలు పెంచుతామని హామీ ఇచ్చారని, అడిగితే తనపై బురద చల్లుతున్నారని చంద్రబాబు అన్నారు. తాను ఎన్నో దేశాలు తిరిగి పెట్టుబడులు రాబట్టానని, అవన్నీ కేంద్రం వల్లనే వచ్చాయని చెబుతున్నారన, అనంతపురం జిల్లాలో కియా కార్ల కంపెనీ కేంద్రం సాయం వల్లే వచ్చిందని చెప్పడం విడ్డూరమని అన్నారు.

లోటు ఇంతైతే...

లోటు ఇంతైతే...

రాష్ట్రానికి 16,700 కోట్ల రూపాయలు లోటు ఉంటే రూ.4 వేల కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు. కేంద్రం ఇవ్వాల్సిన పింఛన్లను కూడా సక్రమంగా ఇవ్వడం లేదని అన్నారు. రాష్ట్రంలోని 11 విద్యా సంస్థలకు నాలుగేళ్లలో రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు.

ఎపికి రాజధాని వద్దా, వెక్కిరిస్తారా...

ఎపికి రాజధాని వద్దా, వెక్కిరిస్తారా...

ఎపికి రాజధాని నగరం అవసరం లేదా, ఓ మంచి నగరం అవసరం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. సహాయం చేయకపోగా విమర్శించడం, వెక్కిరించడం సమంజసమైనా అని అడిగారు. హైదరాబాదు నగరంలో ఎన్నో పరిశోధనా సంస్థలు ఉన్నాయనని చెబుతూ ఎపికి ఎందుకు ఇవ్వరని అడిగారు. రాజధాని నగరం తమ హక్కు కాదా, అడగకూడదా అని ప్రశ్నంచరు. శ్రమదానం చేసైనా సరే అమరావతిని నిర్మిస్తామని చెప్పారు.

  మోడీపై విశ్వాసం ఉంటే రాజీనామాలు, అవిశ్వాసం ఎందుకు ?
   హైదరాబాదుకు అన్ని వచ్చాయంటే..

  హైదరాబాదుకు అన్ని వచ్చాయంటే..

  హైదరాబాదుకు అన్ని వచ్చాయంటే అది తన కష్టమేనని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంతో సంపద సృష్టించామని చెప్పారు. హైదరాబాదుకు ఔటర్ రింగ్ రోడ్డు, సైబరాబాదు వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయంటే తాను చేసిన కృషి వల్లనే అని అన్నారు. హైదరాబాదును ఆర్థిక నగరంగా, నాలెడ్డ్ హబ్‌గా తీర్చిదిద్దానని చెప్పారు. విభజన చేసినప్పుడు వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh CM Nara Chnadrababu Naidu questioned Modi government that was AP in India or not?

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి