పవన్ కల్యాణ్‌ది ఏ జాతి, ఏమిటా భాష: ముద్రగడ లేఖపై బాబు నిప్పులు

జనసేన చీఫ్, సినీ హీరో పవన్ కల్యాణ్‌కు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాసిన బహిరంగ లేఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు.

విజయవాడ: జనసేన చీఫ్, సినీ హీరో పవన్ కల్యాణ్‌కు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాసిన బహిరంగ లేఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ముద్రగడ మా జాతి అని వాడడాన్ని ప్రస్తావిస్తూ ముద్రగడను ప్రశ్నించారు.

మరి పవన్‌ది ఏ జాతి? ముద్రగడ జాతి కాదా! ఆయన చివరకు తనవాళ్లను కూడా వేరు చేసి మాట్లాడుతున్నారని చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేత వద్ద వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ సమన్వయ కమిటీ భేటీ జరిగింది.

ఈ సందర్భగా ముద్రగడ లేఖ ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన ఏం రాస్తున్నారో... ఎవరిని ఉద్దేశించి రాస్తున్నారో మరచిపోయినట్లుగా ఉందని ముద్రగడపై చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఎవరి తరఫున మాట్లాడుతున్నారో...

ఎవరి తరఫున మాట్లాడుతున్నారో...

ముద్రగడ రాసిన లేఖ, అందులో వాడిన భాష చూస్తేనే ఆయన ఎవరి తరపున పని చేస్తున్నారో అర్థమవుతోందని చంద్రబాబు అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడుతున్నారని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది.

Recommended Video

    Pawan Kalyan meets Chandrababu Naidu, Fans Bike rally
    పవన్ కల్యాణ్‌కు ముద్రగడ లేఖ....

    పవన్ కల్యాణ్‌కు ముద్రగడ లేఖ....

    చంద్రబాబుతో భేటీ కావడాన్ని వ్యతిరేకిస్తూ ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్‌కు మంగళవారం బహిరంగ లేఖ రాశారు.ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ప్రయాణించి పరపతి తగ్గించుకోవద్దని ఆయన పవన్ కల్యాణ్‌కు సూచించారు. అంతేగాక, చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని కోరారు.

    మా జాతి అని ఇలా...

    మా జాతి అని ఇలా...

    '31-07-2017న తమరికి, మా జాతికి(బలిజ, తెలగ, ఒంటరి, కాపు) అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 25-08-1994న ఇచ్చిన జి.ఓ నెం. 30ని గౌరవ హైకోర్టు ఫుల్ బెంచ్‌లో కొట్టి వేసినట్లు, బి.సి. రిజర్వేషన్లు జి.ఒ ఇవ్వమని ఉద్యమకారులు తొందర చేస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు మీవద్ద ఆవేదన చెందినట్లుగా వారి పెంపుడు పత్రికలో ఈ రోజు వ్రాయడం జరిగింది' ముద్రగడ రాశారు.

    బెల్టు షా,పులపై చంద్రబాబు...

    బెల్టు షా,పులపై చంద్రబాబు...

    బెల్టు షాపులు మూసివేయాలన్న నిర్ణయం చాలావరకు అమలైందని, రాష్ట్రంలో 500 నుంచి 600 వరకు మాత్రమే మిగిలాయని చంద్రబాబు చెప్పారు. వీటిని కూడా మరో 48 గంటల్లో మూసివేయించాలని నిర్ణయించారు. నిరుద్యోగ భృతి ప్రస్తావనకు వచ్చిన సమయంలో.....ఏ కేటగిరీలో ఎంతమంది అనే డేటా వచ్చాక నిర్ణయిద్దామని చంద్రబాబు చెప్పారు. పవన్ కల్యాణ్ మద్యం విషయంపై కూడా ప్రస్తావించడంతో చంద్రబాబు సమావేశంలో ఆ విషయం చెప్పినట్లు తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+