ఎన్నికల వేళ చంద్రబాబు రాజశ్యామల యాగం; ఈ ఫలితాల కోసమేనా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. అంతేకాదు ఈ ఎన్నికలలో విజయం సాధించాలంటే అధికారాన్ని దక్కించుకోవాలంటే దేవుళ్ళు దయ కూడా కావాలని భావిస్తూ యజ్ఞయాగాలు సైతం చేస్తున్నారు.

తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బాటలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసంలో నేడు రాజ శ్యామల యాగం చేపట్టారు. నేటి నుండి మూడు రోజులపాటు పాటు చంద్రబాబు నాయుడు సతీసమేతంగా రాజశ్యామల శ్యామల యాగాన్ని చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు.

 Chandrababu Raja shyamala Yagam for three days in undavalli house for power in AP!!

50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది. ఈ రాజ శ్యామల యాగాన్ని విజయాన్ని అందుకోవాలని, శత్రువులు క్షీణించాలని, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలని నిర్వహిస్తారు. విజయం సిద్ధించేలా చేయమని శ్యామలాదేవిని అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి యాగాన్ని నిర్వహిస్తారు .

ముఖ్యంగా రాజకీయాలలో ఉన్నవారు అధికారం కోసం చేసే యాగం ఈ రాజ శ్యామల యాగం. టిడిపి అధినేత చంద్రబాబు మాత్రమే కాకుండా, గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాజశ్యామల యాగాన్ని చేశారు. విశాఖపట్టణంలోని శారదాపీఠం వార్షిక ఉత్సవాలలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్న సమయంలో అక్కడ ఉన్న రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆపై రాజశ్యామల యాగాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

రాజశ్యామల యాగాన్ని ఎన్నికలకు ముందు చేయడం ముఖ్యంగా ప్రత్యర్థులను బలహీనం చేయడానికేనని ఈ యాగం గురించి తెలిసిన పండితులు చెబుతున్నారు. ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు మధ్య హోరాహోరీగా ప్రచ్చన్న సమరం కొనసాగుతున్న వేళ జగన్ ను గద్దె దించాలని దృఢ సంకల్పంతో ఉన్న చంద్రబాబు ఈ క్రమంలోనే రాజ శ్యామల యాగం చేయడం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+