హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్ర మేధావులూ! ఆలోచించండి: కెసిఆర్, ఎదుర్కొంటాం: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హైదరాబాదులో బుధవారం నాడు బిజిబిజీగా గడిపారు.

తెలంగాణ సిఎం కెసిఆర్ ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాదులో హెచ్చరికలు జారీ చేశారు. ఎంత ఓర్చుకున్నా, సహించినా ఎప్పుడూ ఎదో ఒక వంకర మాట మాట్లాడటం, ఎదో ఒక పనికి అడ్డుపడటం చంద్రబాబు చేస్తున్నాడని, దీన్ని తెలంగాణ మేథావులు, కవులు, కళాకారులు తమ కవిత్వాల ద్వారా కడిగిపారేయాలన్నారు.

400 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం ముందు ఇప్పటికే కాగితాల పైనే ఉన్న అమరావతి నగరం ఎంత గొప్పదన్న విషయాన్ని ఆంధ్రా మేధావులే ఆలోచించుకోవాలన్నారు.

మరోవైపు, చంద్రబాబు నాయుడు రాజమండ్రిలోని ఆనం కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త రాష్ట్రం, సవాలక్ష సమస్యలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

రవీంద్ర భారతి

రవీంద్ర భారతి

రాష్ట్రం ఏర్పడి ఏడాది గడిచినా కొంతమంది బుద్ది ఇంకా మారలేదని సీఎం కేసీఆర్ అన్నారు. తమ బతుకు మమ్మల్ని బతకనీయండి మహా ప్రబో అని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రవీంద్ర భారతి

రవీంద్ర భారతి

నన్నేమైనా అనండి కానీ తెలంగాణను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ సమాజాన్ని, ప్రజలను, వారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ ఎవరు మాట్లాడినా సహించేదిలేదన్నారు. ఎంతవరకైనా వెళ్తామన్నారు.

రవీంద్ర భారతి

రవీంద్ర భారతి

తెలంగాణపై మాటిమాటికి వెకిలి మాటలు మాట్లాడటం మాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారించి అక్కడి ప్రజలకు ఏం కావాలో చేసిపెట్టు, అమరావతి కాకపోతే ఆరావళి కట్టుకోండి, ఏపీ రాజధాని వర్ధిల్లాలని మేమూ కోరుకుంటామని, కానీ మా జోలికొస్తే మాత్రం ఎంతవరకైనా వెళ్తామన్నారు.

రవీంద్ర భారతి

రవీంద్ర భారతి

ఎంత ఓర్చుకున్నా, సహించినా ఎప్పుడూ ఎదో ఒక వంకర మాట మాట్లాడటం, ఎదో ఒక పనికి అడ్డుపడటం చంద్రబాబు చేస్తున్నాడని, దీన్ని తెలంగాణ మేథావులు, కవులు, కళాకారులు తమ కవిత్వాల ద్వారా కడిగిపారేయాలన్నారు.

రవీంద్ర భారతి

రవీంద్ర భారతి

దాశరథి ఉండి ఉంటే ఇవాళ పరిస్థితి ఇట్లా ఉండేది కాదని కెసిఆర్ అన్నారు. ఇక్కడ అవసరం లేని వార్తలను కొన్ని పత్రికలు పుంకానుపుంకాలుగా తెలంగాణ ప్రజలపై రద్దుతున్నారని, అమరావతి రాజధాని గురించి అంతంత పెద్ద వార్తలు పేజీలకు పేజీలు ప్రచురించి తెలంగాణ ప్రజమీద రుద్దడం అవసరమా? అని ప్రశ్నించారు.

రవీంద్ర భారతి

రవీంద్ర భారతి

శారీరక శ్రమకు అలవాటుపడ్డ హైదరాబాదీలు ఎన్టీఆర్ వచ్చాకనే ఉదయాన్నే నిద్రలేవడం నేర్చుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడటంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

రవీంద్ర భారతి

రవీంద్ర భారతి

హైదరాబాదు చరిత్రను, ఇవాళ ఎవరూ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని, శాతాబ్దాలుగా హైదరాబాదు గొప్పగా బతికిందని, తెలంగాణకు హైదరాబాదు రాజధాని కావడం ఓ వరమన్నారు.

ఆనం కళాకేంద్రం

ఆనం కళాకేంద్రం

రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంతీయ విద్యా సదస్సులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.

ఆనం కళాకేంద్రం

ఆనం కళాకేంద్రం

భారత దేశంలో ఏ రాష్ట్రానికి లేని వనరులు ఏపీకి ఉన్నాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఆనం కళాకేంద్రం

ఆనం కళాకేంద్రం

ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ కోస్ట్ గేట్ వేగా మారే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఆనం కళాకేంద్రం

ఆనం కళాకేంద్రం

సవాళ్లను ఎదుర్కొంటూ రాష్ట్ర అభివృద్ధికై ముందుకు వెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఆనం కళాకేంద్రం

ఆనం కళాకేంద్రం

నీటి వనరులతో అభివృద్ధిని వేగవంతం చేయవచ్చుని, రాష్ట్రంలో ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణాలను అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు నియంత్రిస్తామని చంద్రబాబు అన్నారు.

English summary
AP CM Nara Chandrababu Naidu and Telangana CM K Chandrasekhar Rao are very busy on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X