జగన్-అదానీ డీల్ పై స్పందించిన చంద్రబాబు-అసెంబ్లీలో కీలక ప్రకటన..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం అదానీ పవర్ అధినేత గౌతం అదానీ అప్పటి సీఎం వైఎస్ జగన్ కు రూ.1750 కోట్ల లంచం ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై అసెంబ్లీలో ఇవాళ సీఎం చంద్రబాబు స్పందించారు.
ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు.. భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో సూత్రప్రాయంగా వెల్లడించారు. ఇప్పటికే పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల చంద్రబాబు ఈ మేరకు డిమాండ్ కూడా చేశారు.

జగన్-అదానీ డీల్ ఆరోపణలపై స్పందించిన సీఎం చంద్రబాబు... తమ ప్రభుత్వం పరిస్థితిని అంచనా వేసి, సాక్ష్యాధారరాల ఆధారంగా చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఇంకా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉందని, తాము మాట్లాడే కొద్దీ వాస్తవాలు వెల్లడవుతున్నందున ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందని చంద్రబాబు తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తామన,ఏమి చేయాలో చూసి,చర్యలు తీసుకుంటామన్నారు.

Chandrababu reacted to Gautam adani bribe to ys jagan says assess and act

జగన్ ఈ వ్యవహారంతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీశారని చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపించారు. త్వరలో మరింత సమాచారం వచ్చే అవకాశం ఉన్నందున, దాన్ని కూడా చూశాక చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. తప్పు జరిగితే చర్యలు తప్పవని, అదే తప్పు పునరావృతం కాకుండా చూసేందుకు అదొక్కటే మార్గమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఆరోపణల తీవ్రత, రాష్ట్ర ప్రతిష్టపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఈరోజు బయటకు వచ్చిన అంశం పబ్లిక్ ఫోరమ్‌లో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌ను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఇది తనకు చాలా బాధ కలిగించిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+