ఆలోచిస్తున్నా:టీపై బాబు, రాజధాని గుంటూరు: నాదెండ్ల
హైదరాబాద్/గుంటూరు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య స్థానికత అంశం వివాదం ముదురుతున్నది. తెలంగాణలో 1956 కంటే ముందు నుంచి ఉన్న వారికే ఫీజు రీయంబర్స్‌మెంట్ లభిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ అన్ని కోణాల్లో పరిశీలన చేస్తున్నామని అన్నారు. స్థానికత అంశాన్ని ఎదుర్కోవడానికి ఆలోచిస్తున్నామని అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు శుక్ర, శనివారాల్లో నగరంలోని ఒక హోటల్‌లో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. శనివారం ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతున్నప్పుడు తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూపై విధంగా చెప్పారు.
రాజధానిపై నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన మాజీ సభాపతి నాదెండ్ల మనోహర్ ఆదివారం స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని గుంటూరుకు దగ్గరలో ఏర్పాటు చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. గుంటూరులో ఏర్పాటు చేస్తే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అభివృద్ధిలో గుంటూరు కొంత వెనుకబడి ఉందన్నారు. గుంటూరు చారిత్రక నగరమైనా అభివృద్ధిలో కొంత వెనుకబడి ఉండటం బాధాకరమన్నారు.












Click it and Unblock the Notifications