సోనియాను అనడు, నన్నే అంటాడు: జగన్‌పై బాబు

తెలుగుజాతి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరి కాదని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెసు రాష్ట్ర విభజనను చేపట్టిందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కాంగ్రెసు అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలు 60 రోజులుగా ఉద్యమం చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పకుండా రాష్ట్ర విభజనకు పూనుకోవడం సరి కాదని ఆయన అన్నారు.
ఇరు ప్రాంతాల జెఎసిలను, ప్రజా సంఘాలను పిలిచి రాష్ట్ర విభజనపై మాట్లాడాలని చెప్పామని, అయినా కాంగ్రెసు లెక్కలేని తనంతో వ్యవహరించిందని ఆయన అన్నారు. కాంగ్రెసు విధానం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. జగన్ దొంగే దొంగా దొంగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, కాంగ్రెసు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా మారాయని ఆయన అన్నారు. దేశ ప్రయోజనాలు కాపాడాలని చెప్పామని, అయినా వినలేదని ఆయన అన్నారు.
ప్రజలను కలపడం రాజకీయం గానీ విడదీయడం రాజకీయం కాదని ఆయన అన్నారు. తెలుగుజాతి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని ఆయన అన్నారు. తెరాస, వైయస్సార్ కాంగ్రెసు సహకరిస్తాయని, సీట్లు వస్తాయని కాంగ్రెసు అనుకుంటోందని ఆయన అన్నారు. తెలంగాణపై 2008లో తాము తీర్మానం పంపినప్పుడే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని తాము చెప్పామని ఆయన గుర్తు చేశారు. దానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
కాంగ్రెసుకు చెందిన ముఖ్యమంత్రి, మంత్రులు, శానససభ్యులే రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడిందంటే విభజన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బ తినే విధంగా వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన అన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కాంగ్రెసు సిబిఐని ప్రయోగిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications