జగన్ మారనంత వరకు అంతే, నిన్న గెలిచి ఇంత తలపొగరా: నెహ్రూ

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరు మారనంత కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉంటారని టిడిపి నేత దేవినేని నెహ్రూ బుధవారం అన్నారు.

చంద్రబాబు, కేసీఆర్‌లకు 'శాతకర్ణి' చిక్కులు

పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించిన మొదటి వ్యక్తిని తానే అన్నారు. ఈ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేయలేరని తాను తొలుత చెప్పానన్నారు. కాని చంద్రబాబు మాత్రం అనుకున్న సమయంలో పూర్తి చేశారన్నారు.

devineni nehru

రేపు పురుషోత్తపట్నం ప్రాజెక్టు కూడా అదే విధంగా పూర్తి చేస్తారన్నారు. చంద్రబాబు లేకుండా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం అసాధ్యమన్నారు. జగన్ తీరు మారనంత కాలం చంద్రబాబే సీఎంగా ఉంటారన్నారు.

ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కేవీపీ రామచంద్ర రావు విభజన సమయంలో ఏపీ కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. నిన్నగాక మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు తలపొగరుగా మాట్లాడుతున్నారని, ప్రధానులుగా, రాష్ట్రపతులుగా ఫీలవుతున్నారన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chandrababu remain CM, if YS Jagan attitude will not change, says Devineni Nehru.
Please Wait while comments are loading...