ఐవైఆర్‌ ధిక్కారం: కొత్తగా ఆనందసూర్య.. సీఎం నిర్ణయంపై లోకేష్ ఇలా!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. ఫేస్ బుక్ లో ఐవైఆర్‌ కృష్ణారావు పెట్టిన ప్రభుత్వ వ్యతిరేక పోస్టుల పట్ల పెద్ద దుమారమే రేగడం.. అది కాస్త సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయనపై వేటు తప్పలేదు.

బాబుకు పక్కలో బల్లెంలా!: ఏరి కోరి ఇచ్చినందుకు ధిక్కారం

ఈ వ్యవహారం బయటకొచ్చిన తర్వాత అటు ప్రభుత్వం గానీ.. ఇటు ఐవైఆర్ గానీ ఒకరినొకరు కనీసం సంప్రదించలేదు. ఐవైఆర్ ఖాతా ఏమైనా హ్యాక్ అయిందా? అన్న అనుమానాలు తలెత్తినప్పటికీ.. తనకా మాత్రం భావప్రకటన స్వేచ్చ లేదా? అంటూ ఆయన వాపోయినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి ఐవైఆరే ఫేస్ బుక్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడాని నిర్దారించుకున్న ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది.

chandrababu replaced IYR Krishna Rao with Anand Mourya for Brahmin welfare corporation

ఐవైఆర్‌ కృష్ణారావు స్థానంలో.. అదే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత ఆనందసూర్య ప్రభుత్వం కొత్తగా నియమించింది. మరోవైపు మంగళవారం మధ్యాహ్నాం దీనిపై ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తానని ఐవైఆర్ ప్రకటించడంతో.. ఆయన వివరణ ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే, మంత్రి నారా లోకేష్ ఈ వ్యవహారంపై స్పందించారు. ఐవైఆర్ వ్యవహారంలో సీఎం చంద్రబాబుదే తుది నిర్ణయమని, చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి పార్టీ అంతా కట్టుబడి ఉంటుందని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu Naidu suspended IYR Krishna Rao from Brahmin welfare corporation chairman. In place of IYR he appointed Anand Mourya newly
Please Wait while comments are loading...