జగన్ దగ్గర పనిచేసిన అధికారి పరిస్ధితే ఇలా ఉంటే.. చంద్రబాబు రీట్వీట్..!
ఏపీలో ఎన్నికలకు వారం రోజులే గడువున్న నేపథ్యంలో వివాదాస్పద భూహక్కు చట్టంపై వైసీపీ వర్సెస్ విపక్షాల వార్ కొనసాగుతోంది. ఈ చట్టంతో ప్రయోజనం ఉంటుందని వైసీపీ చెప్తుంటే విపక్షాలు మాత్రం ఈ చట్టం ఉపయోగించుకుని జగన్ మీ భూములు లాక్కుంటారంటూ ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ఈ చట్టాన్ని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యల వీడియోను వైసీపీ తాజాగా రిలీజ్ చేసింది. ఇదంతా సాగుతుండగానే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
భూహక్కు చట్టంపై వస్తున్న విమర్శలకు కొనసాగింపుగా రాష్ట్రంలో వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ ఇవాళ ట్వీట్ చేశారు. తాను కూడా భూహక్కు చట్టం బాధితుడినే అన్నారు. ఈ మేరకు కృష్ణాజిల్లాలో తన తల్లి తండ్రుల భూముల మ్యుటేషన్ చేయించుకోలేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. తన తల్లి తండ్రుల పేరు మీద ఉన్న పట్టా భూముల్ని వారి మరణం తర్వాత మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని ఆరోపించారు.

జగన్ సీఎంఓలో పని చేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇల్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదు!#JaganLandGrabbingAct pic.twitter.com/VwEwqljLBs
— N Chandrababu Naidu (@ncbn) May 6, 2024
దీనిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు పీవీ రమేశ్ ట్వీట్ ను రీట్వీట్ చేశారు. అంతే కాదు ఆయన వ్యాఖ్యల్ని జనానికి గుర్తుచేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎంఓలో పని చేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండని కోరారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇల్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదంటూ ప్రజలకు సూచించారు.
జగన్ సీఎంఓలో పని చేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇల్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదు!#JaganLandGrabbingAct pic.twitter.com/VwEwqljLBs
— N Chandrababu Naidu (@ncbn) May 6, 2024
అంతకుముందు పీవీ రమేశ్ తన ట్వీట్ లో ... తన తల్లితండ్రుల పట్టా భూముల్ని వారి మరణం తర్వాత మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ తిరస్కరించారని, ఆర్డీవో పోస్టు ద్వారా పంపిన పత్రాల్ని చూడకుండానే వెనక్కి పంపేశారని ఆరోపించారు. తన తల్లితండ్రుల భూములపై తనకు హక్కు లేకుండా చేస్తున్నారన్నారు. ఐఏఎస్ అధికారిగా ఆంధ్రప్రదేశ్ కు 36 ఏళ్ల పాటు సేవలందించిన తన పరిస్ధితే ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితి ఊహించలేమంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో పీవీ రమేశ్ ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది.












Click it and Unblock the Notifications