అశోక్ గజపతిరాజుతో సిగరెట్ మాన్పించిన సింగపూర్ ! సీక్రెట్ చెప్పిన చంద్రబాబు..!
గోవా గవర్నర్ గా తాజాగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ మాజీ నేత, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గురించిన ఓ రహస్యాన్ని ఇవాళ సీఎం చంద్రబాబు బయటపెట్టారు. ప్రస్తుతం సింగపూర్ టూర్ లో ఉన్న చంద్రబాబు.. అక్కడి తెలుగు వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో చాలా విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో అశోక్ గజపతిరాజు గురించిన ప్రస్తావన కూడా తెచ్చారు. సింగపూర్ లో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో చెప్పేందుకు ఈ ఉదాహరణ చెప్పారు.
నాలుగు దశాబ్దాల పాటు టీడీపీలో వివిధ హోదాల్లో పనిచేసిన అశోక్ గజపతిరాజు గతంలో చంద్రబాబు కేబినెట్లో ఆర్ధిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆయన చంద్రబాబుతో పాటు ఓసారి సింగపూర్ కు వెళ్లాల్సి వచ్చింది. అశోక్ గజపతిరాజు వాస్తవానికి చైన్ స్మోకర్. పొగ తాగకుండా ఉండలేరు. అలాంటి అశోక్ గజపతిరాజు చంద్రబాబుతో కలిసి సింగపూర్ వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ఓ నిబంధన ఆయన్ను పొగ తాగకుండా అడ్డుకుంది.

సింగపూర్ లో పొగ తాగితే 500 డాలర్ల జరిమానా విధిస్తారు. ఈ నిబంధన తెలిసిన అశోక్ గజపతిరాజు పొగ తాగకుండా ఉండిపోయారట. ఈ విషయాన్ని ఇవాళ చంద్రబాబు అక్కడి తెలుగు వారితో పంచుకున్నారు. సింగపూర్ లో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయన్న విషయాన్ని అక్కడి తెలుగు వారితో పంచుకున్న చంద్రబాబు అదే సమయంలో అశోక్ గజపతిరాజు స్టోరీ కూడా చెప్పారు. అశోక్ గజపతిరాజుతో అలా సింగపూర్ సిగరెట్ స్మోకింగ్ మాన్పించిందని.. దటీజ్ సింగపూర్ అని చంద్రబాబు ఆ దేశంపై ప్రశంసలు కురిపించారు.

సింగపూర్ లో చట్టాలు కఠినంగా ఉంటాయని...అక్కడ బహిరంగంగా సిగరెట్ తాగితే 500 డాలర్లు ఫైన్ వేస్తారని చంద్రబాబు తెలిపారు. తాను తెచ్చుకుందే 500 డాలర్లు...ఒక్క సిగరెట్ కు అంత సొమ్ము పెడితే మిగిలిన రోజుల్లో ఖర్చులకు డబ్బులు ఎలా అని ఆశోక్ గజపతి రాజు సింగపూర్ లో ఉన్నన్ని రోజులు సిగరెట్ తాగలేదని గుర్తు చేసుకున్నారు. అలా చట్టాలను అమలు చేయడంలో ఎంతో మంచి పేరున్న, అవినీతికి ఆస్కారం లేని సింగపూర్ అంటే తనకుఎంతో అభిమానమని నాటి ఘటనను నవ్వుతూ చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.












Click it and Unblock the Notifications