వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్వేతపత్రం: వ్యవసాయంపై చంద్రబాబు సమీక్ష(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పి పుల్లా రావు, ఆ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయం శ్వేతపత్రం విడుదల చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం.

మరో సమావేశంలో ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రెవెన్యూ అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంతోపాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చేపట్టబోయే అభవృద్ధి ప్రాజెక్టులకు ఎంత భూమిని సేకరించాలో అధ్యయనం చేయాలని రెవెన్యూశాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వాటికి అవసరమైన భూమిని సేకరించేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా భూ సేకరణ విధివిధానాలపై సమీక్షించారు. కొత్తగా అమలులోకి వచ్చిన భూసేకరణ చట్టం మూలంగా ఎదురయ్యే అడ్డంకులపై చర్చించారు. రాజధానితోపాటు పలు నీటి పారుదల, నౌకాశ్రయ, విమానాశ్రయ ప్రాజెక్టులతోపాటు కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిన పలు విశ్వవిద్యాలయాలు, ప్రతిష్టాత్మక సంస్థలకు అవసరమైన భూమిని వీలైనంత వేగంగా సేకరించే చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పి పుల్లా రావు, ఆ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ సమావేశంలో వ్యవసాయం శ్వేతపత్రం విడుదల చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం.

చంద్రబాబు

చంద్రబాబు

మరో సమావేశంలో ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రెవెన్యూ అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంతోపాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చేపట్టబోయే అభవృద్ధి ప్రాజెక్టులకు ఎంత భూమిని సేకరించాలో అధ్యయనం చేయాలని రెవెన్యూశాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Tuesday reviewed on state agriculture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X