చంద్రబాబు జీవితమంతా కుట్రలు, కుతంత్రాలు .. లోకేష్ కు ఆ విషయం కూడా తెలీదా .. సజ్జల ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై, మాజీ మంత్రి నారా లోకేష్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు జీవితమంతా కుళ్ళు , కుట్రలు, కుతంత్రాలు అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు కుల, మత రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

 కరోనా కష్టకాలంలో చంద్రబాబు, లోకేష్ లు ఏమైపోయారు అని ఆయన ప్రశ్నించారు.

కరోనా కష్టకాలంలో చంద్రబాబు, లోకేష్ లు ఏమైపోయారు అని ఆయన ప్రశ్నించారు.

కరోనా సమయంలో చంద్రబాబు పక్క రాష్ట్రంలో దాక్కున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి సలహా ఇవ్వాల్సింది పోయి, ప్రజలకు అండగా నిలవాల్సినది పోయి పక్క రాష్ట్రంలో దాక్కున్నారు అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి అంశంపై చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని అవాస్తవాలు మాట్లాడుతున్నారని సజ్జల మండిపడ్డారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఏం చేయని చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వం పై బురద చల్లుతున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.

గ్యాస్ పై వ్యాట్ .. చంద్రబాబు అవాస్తవాల ప్రచారం

గ్యాస్ పై వ్యాట్ .. చంద్రబాబు అవాస్తవాల ప్రచారం

చంద్రబాబు రాజధాని కోసం చందాలు వసూలు చేశారని, ఆ చందాలు ఏమయ్యాయని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి. బలవంతపు భూసేకరణ చేసి చంద్రబాబు రైతులను మోసం చేశారని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సీఎన్జీ పై 20 కోట్ల టర్నోవర్ మాత్రమే ఉందని, రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది కనుక తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాట్ పెంచాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఆర్థికంగా పేదలను ఆదుకోవాలని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి నాచురల్ గ్యాస్ పై వ్యాట్ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారన్నారు .

ఎల్పీజీ కేంద్ర పరిధిలోని అంశం .. లోకేష్ కు ఇది కూడా తెలీదా ?

ఎల్పీజీ కేంద్ర పరిధిలోని అంశం .. లోకేష్ కు ఇది కూడా తెలీదా ?

మతాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, అంతర్వేది విషయంలో సున్నితమైన అంశాన్ని రెచ్చగొట్టి విద్వేషాలను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో జరిగిన ఘటనలు అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. నారా లోకేష్ ను ఉద్దేశించి మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి లోకేష్ కు తెలుగు కూడా సరిగ్గా మాట్లాడటం రాదు అంటూ ఎద్దేవా చేశారు. అదే సమయంలో ఎల్పిజి కేంద్ర పరిధిలోని అంశం అని కూడా లోకేష్ కి తెలియదని నారా లోకేష్ ఎంత చదువుకుని ఏం ప్రయోజనం అంటూ ప్రశ్నించారు.

Recommended Video

    Ease Of Doing Business లో Andhra Pradesh స్థానం పై TDP వ్యాఖ్యలు || Oneindia Telugu
     జీవో చదవకుండానే లోకేష్ ట్వీట్ చేస్తారా ? ప్రశ్నించిన సజ్జల

    జీవో చదవకుండానే లోకేష్ ట్వీట్ చేస్తారా ? ప్రశ్నించిన సజ్జల

    వ్యాట్ పెంచుతూ ఇచ్చిన జీవో కూడా చదవకుండా లోకేష్ ట్వీట్ చేస్తారా అంటూ పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి సిఎన్జి కి, ఎల్పీజీ కి కూడా లోకేష్ కి తేడా తెలియటం లేదా అని అడిగారు. మీడియా మేనేజ్మెంట్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి పేదల సంక్షేమం కోసం జగన్ ఒక యజ్ఞం చేస్తున్నారు. లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా నగదు జమ చేస్తున్నారు. ఇచ్చిన ప్రతి మాటకు సీఎం జగన్మోహన్ రెడ్డి కట్టుబడి పని చేస్తున్నారు అని పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+