నా బ్రాండ్ ఇమేజ్ వల్లే ఏపీకి 2 ర్యాంక్, సింగపూర్ వెళ్తున్నా: బాబు, రేవంత్ సహా భేటీ

హైదరాబాద్: నా బ్రాండ్ ఇమేజ్‌తోనే పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఆయన హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చారు.

బుధవారం పట్టిసీమ వద్ద కృష్ణా - గోదావరి నదుల సంగమం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తిరుమల వెళ్లారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం గురువారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రపంచ బ్యాంక్ నివేదిక ఏపీకి పరిశ్రమలను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.

Chandrababu says AP second in World Bank ranks due to his brand image

నా బ్రాండ్ ఇమేజితోనే ఏపీ పెట్టుబడుల అనుకూల రాష్ట్రంగా మారిందన్నారు. త్వరలో మరిన్ని పరిశ్రమలు స్థాపనకు ముందుకు వస్తాయని చెప్పారు. శ్రీశైలం నీటిని సీమకు తరలించి పట్టిసీమ ఫలితాన్ని చూపిస్తామని చంద్రబాబు చెప్పారు.

మరిన్ని పరిశ్రమలకు ఏపీ వేదిక కానుందన్నారు. నదుల అనుసంధానం చారిత్రక ఘట్టమన్నారు. రాజధాని శంకుస్థాపనకు సింగపూర్ ప్రధానిని ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ నెల 20వ తేదీన తాను సింగపూర్ వెళ్తున్నానని చెప్పారు.

తెలంగాణ నేతలతో బాబు భేటీ

చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టిడిపి నేతలతో భేటీ అయ్యారు. ఏపీ పాలన కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయంతో పాటు తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు వారంలో ఐదు నుంచి ఆరు రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. ఈ రోజు హైదరాబాద్ వచ్చారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత తెలంగాణ టీడీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఉపనేత రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+