మోడీకి చేయిచ్చిన బాబు, అద్వానీతో భేటీ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అన్నింటా తానై.. బిజెపి, ఎన్డీయే కూటమిని విజయపథంలో నడిపిన నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. కర్తవ్య దీక్ష ఉన్న మోడీ 2019లోనే కాదు.. మళ్లీ మళ్లీ ఆయనే ప్రధాని కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మంగళవారం ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు.. మోడీని ప్రశంసలతో ముంచెత్తారు.
తాను చాలామంది నేతలను చూశానని, కానీ మోడీ చిత్తశుద్ధి, తపన అమోఘమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ తీవ్రంగా శ్రమించారన్నారు. భోజనం కూడా చేయకుండా ఒకేరోజు సీమాంధ్రలో ఐదు సభల్లో మోడీ ప్రసంగించారని బాబు కొనియాడారు. ఆయన తన పట్టుదల, దృఢ సంకల్పంతో దేశానికి కొత్త రూపు తీసుకువస్తారన్న భరోసా తనకు ఉందని బాబు చెప్పారు. మోడీ హయాంలో ప్రపంచ శక్తిమంతమైన దేశాల్లో భారత్ స్థానం సంపాదిస్తుందన్నారు.
అమెరికా, చైనా వంటి దేశాల సరసన భారత్ ఉండాలని, ఇంకా పలు అభివృద్ధి చెందిన దేశాలున్నా ఈ రెండు దేశాల నుంచే అసలు పోటీయని, మోడీ దీన్ని చేసి చూపుతారన్న విశ్వాసం ఉందని, ఈ దేశ నిర్మాణం దృష్ట్యా మోడీతో మేము భాగస్వాములమవుతామవుతామని, దేశాన్ని శుద్ధి చేసి, అభివృద్ధి బాట పట్టించాలన్న మోడీ లక్ష్యసాధనకు తాము పూర్తిగా మద్దతిస్తామన్నారు.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శాలువా కప్పి అభినందిస్తున్న బిజెపి నేత వెంకయ్య నాయుడు.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన శిరోమణి అకాళీదల్ ముఖ్య నాయకులు.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీయే భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీతో చర్చలు.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు.

సుజనా
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి మంగళవారం ఢిల్లీలో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు.

జెసి దివాకర్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ నాయకుడు, అనంతపురం లోకసభ సభ్యులు జెసి దివాకర్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు.

మోడీతో...
తెలుగుదేశం పార్టీ నాయకుడు, అనంతపురం లోకసభ సభ్యులు జెసి దివాకర్ రెడ్డి, మాగంటిలు మంగళవారం ఢిల్లీలో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు.

గల్లా జయదేవ్
తెలుగుదేశం పార్టీ నాయకుడు, గుంటూరు లోకసభ సభ్యులు గల్లా జయదేవ్ మంగళవారం ఢిల్లీలో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు.

గల్లా జయదేవ్
తెలుగుదేశం పార్టీ నాయకుడు, గుంటూరు లోకసభ సభ్యులు గల్లా జయదేవ్ మంగళవారం ఢిల్లీలో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు.

మోడీ
తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాజమండ్రి లోకసభ సభ్యులు మురళీ మోహన్ మంగళవారం ఢిల్లీలో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు.

బిజెపితో కలిసి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపి అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్, నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలతో కలిసి విలేకరుల సమావేశంలో...

ఎన్డీయే
మంగళవారం ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాలులో ఎన్డీయే పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎపి నుండి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, టిడిపి, బిజెపి ఎంపీలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications