అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డోర్లు మూసి విభజన, రాజధానికి రూ.5లక్షల కోట్లు, 20 ఏళ్లు: బాబు

హైదరాబాద్ లాంటి నగర నిర్మాణానికి రూ.5 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం వ్యాఖ్యానించారు. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: హైదరాబాద్ లాంటి నగర నిర్మాణానికి రూ.5 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం వ్యాఖ్యానించారు. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు.

టిడిపిని వద్దంటారా!?: వీడియోలు చూసి సొంత నేతలకు బిజెపి షాక్టిడిపిని వద్దంటారా!?: వీడియోలు చూసి సొంత నేతలకు బిజెపి షాక్

రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విభజించిందని నిప్పులు చెరిగారు. అన్యాయం చేసిన వాళ్లు సిగ్గుపడేలా నవ్యాంధ్రను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. రేపటి నుంచి 8వ తేదీ వరకు నవ నిర్మాణ దీక్షలు అని, నష్టం పూడ్చుకునేందుకు ఏం చేయాలో హామీ తీసుకోవాలన్నారు.

రాజధానికి 20 ఏళ్లు

రాజధానికి 20 ఏళ్లు

అద్భుత రాజధానికి ఇరవై ఏళ్లు పడుతుందని చంద్రబాబు అన్నారు. రానున్న రెండేళ్లలో ఏం సాధించాలో నిర్దేశించుకున్నామని తెలిపారు. దక్షిణ భారత దేశంలో మనం ఆదాయంలో చివరి స్థానంలో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ చేసిన పనికి కష్టపడి సమాధానం చెబుతామన్నారు.

తలుపులు మూసేసి విభజన.. జపాన్‌లా కసిగా..

తలుపులు మూసేసి విభజన.. జపాన్‌లా కసిగా..

పార్ల‌మెంటులో త‌లుపులు మూసేసి, ప‌ద్ధ‌తి లేకుండా రాష్ట్రాన్ని విభ‌జించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన నేపథ్యంలో నిరాశకు లోనైన ప్రజలకు తాను భరోసా ఇచ్చానన్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో నాశనమైపోయిన జపాన్ ఓ కసి, తపనతో పుంజుకుందని, అలాంటి కసితోనే ఏపీని కూడా ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు. తాము కరవును ఎదుర్కోవడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నామన్నారు.

అవన్నీ నిజం కాదా?

అవన్నీ నిజం కాదా?

కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ చర్చలు జరపడం అవాస్తవమా అని ప్రశ్నించారు. అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. ఇటలీ ఆవిర్భావ దినోత్సవం నాడు రాష్ట్ర విభజన పైన నిర్ణయం తీసుకోలేదా అని నిప్పులు చెరిగారు.

నవ నిర్మాణ దీక్ష

నవ నిర్మాణ దీక్ష

రేపు న‌వ‌నిర్మాణ దీక్ష చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చంద్రబాబు తెలిపారు. తెలిపారు. రేపు (శుక్రవారం) ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఈ దీక్షలో అందరూ పాల్గొనాలని సూచించారు. రేపటి నుంచి ఏడురోజుల పాటు అన్యాయంగా రాష్ట్ర‌ విభ‌జ‌న జ‌రిపిన‌ రోజును గుర్తు చేసుకుందామ‌ని, ఏ స్థితి నుంచి అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టామో చ‌ర్చించుకుందామ‌న్నారు. జూన్ 8న మహా సంకల్పం అన్నారు.

మూడేళ్లలో ఏం సాధించామో సమీక్ష

మూడేళ్లలో ఏం సాధించామో సమీక్ష

విభ‌జ‌న చ‌ట్టం హామీల అమ‌లుపై చ‌ర్చిద్దామ‌ని, మూడేళ్ల‌లో ఏం సాధించామో స‌మీక్ష చేసుకుందామ‌ని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు క‌రెంటు లేని ఇళ్లు ఎక్క‌డాలేవని అన్నారు. గత ఏడాది వంద శాతం విద్యుత్ లక్ష్యాన్ని సాధించామన్నారు. ఎల్లుండి కూడా అంతా స‌మావేశమై కరవు రహిత రాష్ట్రంగా తయారు చేయడానికి ఏమి చేయాలో తాము చ‌ర్చిస్తామ‌న్నారు.

ఆదాయం తక్కువగా ఉంది

ఆదాయం తక్కువగా ఉంది

దేశంలో మధ్యప్రదేశ్ తర్వాత వ్యవసాయంపై ఎక్కువ‌గా ఆధార‌ప‌డిన వారు ఏపీలో ఉన్నారని చంద్రబాబు అన్నారు. అర్బ‌న్ ఏరియాలు ఎక్కువ‌గా లేవు కాబ‌ట్టి రాష్ట్రానికి ఆదాయం త‌క్కువ‌గా ఉందన్నారు. ఆర్థిక సంస్క‌ర‌ణ ఫ‌లితాలు పేద‌వారికి చేరే అంశంపై చర్చిద్దామ‌న్నారు.

వీటిపై చంద్రబాబు అసంతృప్తి

వీటిపై చంద్రబాబు అసంతృప్తి

నవ నిర్మాణ దీక్షను సీరియస్‌గా తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ విషయంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పని చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇంటింటికి గ్యాస్ ఇవ్వాలన్నారు. అంతకుముందు, ఏపీ కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ వ్యవహారం, స్కూళ్ల రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై చర్చించారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Thursday said that Rs 5 lakh crore money need for contruction of Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X