వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా తీరుపై జగన్ 'సాక్షి' కూడా సంతృప్తి: బాబు ఆసక్తికర వ్యాఖ్య

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోట నుంచి మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక పైన మాట్లాడారు. సాక్షి పత్రిక వ్యతిరేక కథనాలు రాయలేకపోతుందని ఆయన అన్నారు.

పుష్కర ఏర్పాట్లపై మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సాక్షి పత్రిక పేరును ప్రస్తావించారు. పుష్కర ఏర్పాట్లకు సంబంధించి జనం సంతృప్తిగా ఉన్నారన్నారు. చివరకు సాక్షి కూడా వ్యతిరేకంగా రాయలేకపోతోందని, తద్వారా పుష్కరాల ఏర్పాట్లపై జగన్ పత్రిక కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లేనని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు బుధవారం నాడు పుష్క‌రాల‌పై సంబంధిత అధికారుల‌తో టెలికాన్ఫ‌రెన్స్ ద్వారా చ‌ర్చించారు. కృష్ణా పుష్క‌రాల్లో అర్ధ‌భాగం విజ‌య‌వంతంగా పూర్తి చేశామ‌న్నారు. డ‌బ్బుల వ‌సూలుపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలని సూచించారు.

ఏం చేద్దాం: ఏపీకి హోదాపై భేటీలు: తెలంగాణ అభిప్రాయమని వెంకయ్య!ఏం చేద్దాం: ఏపీకి హోదాపై భేటీలు: తెలంగాణ అభిప్రాయమని వెంకయ్య!

Chandrababu says Sakshi daily also happy with pushkara arrangements

మ‌రిన్ని ఉచిత బ‌స్సుల‌ను భ‌క్తుల‌కు అందుబాటులోకి తేవాల‌న్నారు. ప‌ద్మావ‌తి ఘాట్ వ‌ద్ద ఉద‌యం ఐదు నుంచి పదకొండు గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల రద్దీ అధికంగా ఉంటుంద‌ని చెప్పారు. యాత్రికుల‌ను నియంత్రించే అంశాల‌పై ఆయ‌న సూచ‌న‌లు చేశారు.

గవర్నర్ దంపతుల పుష్క స్నానం

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పుష్కర స్నానమాచరించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో విజయవాడ చేరుకున్న గవర్నర్‌ దంపతులు పున్నమి ఘాట్‌లో పుణ్య స్నానం చేశారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు.

English summary
AP CM Chandrababu Naidu says Sakshi daily also happy with pushkara arrangements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X