ఇక్కడ వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే: బాబు, 'కొత్త గవర్నర్ వస్తేనే ఏపీకి మంచి'

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీయే గెలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారం కాకినాడలో పర్యటించారు. పార్టీ కార్యాలయ కొత్త భవనాన్ని, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఇప్పుడు అడగడమా?: కేశినేని-జేసీ తీవ్ర ఆగ్రహం, 'భోజనానికి పిలిచినట్లు'

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్క్రానికి పార్టీ కార్యాలయం వేదిక కావాలని అన్నారు. పార్టీ కార్యాలయానికి వెళ్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్న భావన ప్రజల్లో రావాలన్నారు.

ప్రతీది రచ్చ, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు: పరిటాల, పరకాల, ఉమ్మారెడ్డి దిమ్మతిరిగే కౌంటర్

 అమెరికా, చైనాలకు ధీటుగా

అమెరికా, చైనాలకు ధీటుగా

వచ్చే ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాల్లో అన్ని స్థానాల్లోను తెలుగుదేశం పార్టీయే గెలుస్తుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. చంద్రబాబు అంతకుముందు కలెక్టర్లు, అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేవలం 40 ఏళ్లలోనే జపాన్, కొరియా, సింగపూర్ దేశాలు ఆర్థిక అభివృద్ధి సాధించాయని చెప్పారు. భారత్ ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తే అమెరికా, చైనాలకు ధీటుగా ముందుకు వెళ్తుందన్నారు.

జన్మభూమితో నూతన ఒరవడి

జన్మభూమితో నూతన ఒరవడి

జన్మభూమి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని, ప్రజల్లో విశ్వాసం పెంచిందని, సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. గత మూడున్నరేళ్ళుగా అభివృద్ధిపై, ఆర్థిక అసమానతల తగ్గింపుపై దృష్టి పెట్టామని చంద్రబాబు చెప్పారు. పేదరిక నిర్మూలనకే సమాజ వికాసం, కుటుంబ వికాసం తెచ్చామన్నారు.

 విభజన జరిగి నలభై నెలలు దాటినా

విభజన జరిగి నలభై నెలలు దాటినా

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పైన ఏపీ బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి నలభై నెలలు దాటినా గవర్నర్ నరసింహన్ ఏనాడూ ఏపీ బాగోగులు పట్టించుకోలేదని విమర్శించారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కనీసం బిల్లులు పాస్ చేసేందుకు కూడా గవర్నర్ ఆసక్తి కనబర్చడం లేదని వాపోయారు. నాలా బిల్లు పెట్టి ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకూ ఆ బిల్లు పాస్ కాలేదని అన్నారు.

 కొత్త గవర్నర్ వస్తేనే ఏపీకి మంచి

కొత్త గవర్నర్ వస్తేనే ఏపీకి మంచి

చుట్టపు చూపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పోవడం మినహా గవర్నర్‌ నరసింహన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లోగా కొత్త గవర్నర్‌ను నియమించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో గవర్నర్ నివాసానికి అనువైన వసతులు లేవన్న కారణంగా రాలేకపోతున్నారా? అని ప్రశ్నించారు. కొత్త గవర్నర్ నియామకం వెంటనే జరిగితే ఏపీకి మంచి జరుగుతుందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu said that TDP will win in east godavari in next elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X