కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రంలో టీడీపీ గాలి-వైసీపీ కొట్టుకుపోతుంది-కర్నూల్లో చంద్రబాబు కామెంట్స్-కోట్లపై ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల టూర్ కోసం ఓర్వకల్లు వచ్చిన ఆయన.. అనంతరం పాణ్యం, కోడుమూరులో పర్యటించారు. ఓవైపు స్ధానికంగా ఉన్న సమస్యలు తెలుసుకుంటూనే, మరోవైపు పార్టీ నేతలతో భేటీలు అవుతున్నారు.రాయలసీమలో,అందులోనూ గతంలో టీడీపీకి అత్యధిక స్ధానాలు ఇచ్చిన జిల్లా అయిన కర్నూల్లో తిరిగి పార్టీకి పునర్ వైభవం తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 కర్నూల్లో చంద్రబాబు

కర్నూల్లో చంద్రబాబు

చంద్రబాబు ఇవాళ మూడు రోజుల పర్యటన కోసం కర్నూల్ జిల్లా ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.అక్కడ ఆయనకు కర్నూలు జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ వద్ద విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖీ మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై వారు చంద్రబాబుకు తమ ఇబ్బందులు చెప్పుకున్నారు.జాబు రావాలి అంటే బాబు రావాలి అంటూ నినాదాలు చేశారు. టీడీపీ హయాంలో 5 ఏళ్లలో రాష్ట్రం లో 16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నామని, అవి కొనసాగి ఉంటే 30 లక్షల ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు తెలిపారు.

అప్పటికే 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ రోజు మనం ఉద్యోగాల కోసం హైదరాబాద్ ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎయిర్ పోర్టు ఎవరు కట్టించారని స్ధానికుల్ని అడిగారు.

రాజధాని లేని రాష్ట్రం ఉంటుందా?

రాజధాని లేని రాష్ట్రం ఉంటుందా?

కర్నూల్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ కోసం 10 వేల ఎకరాలు ఇచ్చామని, జిల్లాకు సీడ్ పార్క్ తెచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. సోలార్ పార్క్ తెస్తే కమిషన్ల కోసం జగన్ రెడ్డి నిలిపివేశారన్నారు. అన్నీ సెట్ చేసుకుని మళ్లీ ప్రారంభించారని విమర్శించారు. అభివృద్ధికి టీడీపీ మారుపేరని, ప్రతీ కార్యక్రమం ఇక్కడ టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు.

హైదరాబాద్ ఉన్న తెలంగాణ కంటే మనం అభివృద్ధి చెందాలి అనుకున్నానని, అందుకే అమరావతి తలపెట్టామన్నారు. ఈ రోజు రాష్ట్రానికి ఏమిటీ ఖర్మ? అని ప్రశ్నించారు. యువతలో చైతన్యం రావాలని, వాస్తవాలు ప్రజలకు చెప్పాలని చంద్రబాబు కోరారు. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఉంటుందా? అని ప్రశ్నించారు. జగన్ మూడు ముక్కల ఆట ఆడుతున్నాడని, నాడు వైఎస్సార్ హైటెక్ సిటీ కూల్చివేసి ఉంటే తరువాత అభివృద్ధి జరిగేదా అని అడిగారు. కర్నూల్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు నిలిపివేశారని ఆరోపించారు.

జగన్ రెడ్డి తండ్రిని కూడా గౌరవించలేదని, ఆయన తెచ్చిన వేమన యూనివర్సిటీ లో వేమన విగ్రహం తొలగించారన్నారు. కర్నూల్ లో పరిశ్రమలు రావాలని 10 వేల ఎకరాలలో టౌన్ షిప్ తెచ్చామన్నారు. సోలార్ ప్రాజెక్ట్ లు తెచ్చి నాడు ఉపాధి కల్పించామని, రాయలసీమ యూనివర్సిటీ లో సిబ్బందికి కనీసం జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఎమ్మెల్సీ గా టీడీపీ నిలబెట్టిన రాంగోపాల్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. యువత భవితకు నాదీ భరోసా అన్నారు.

 పాణ్యంలో పత్తి రైతుల పరామర్శ

పాణ్యంలో పత్తి రైతుల పరామర్శ

అనంతరం ప్రాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం మార్కాపురం గ్రామంలో పత్తి పంటలను చంద్రబాబు పరిశీలించారు. నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోయినట్లు చంద్రబాబుకు రైతులు వివరించారు. నకిలీ విత్తనాలపై జిల్లా కలెక్టర్ వరకు ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదు అని రైతులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు.

ప్రజా ప్రతినిదులు కూడా కంపెనీల వారితో కుమ్మక్కు అయ్యారని రైతుల అవేదన వ్యక్తం చేశారు. పత్తిపంట సాగు చేసి నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టం పోయామని చంద్రబాబు వద్ద రైతులు అవేదన వ్యక్తం చేశారు.

 కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డిపై ప్రశంసలు

కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డిపై ప్రశంసలు

అనంతరం కోడుమూరు సెంటర్ లో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేశారు. రాజకీయాల్లో నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి విజయ భాస్కర్ రెడ్డి అని ప్రశంసించారు. అవినీతికి, అక్రమాలకు ప్రతిరూపం జగన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో మట్టి దోపిడీ, అక్రమాలు,దౌర్జన్యాలు చేస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. నీరు ఉండే ప్రాంతాలు, ఎయిర్ పోర్టు సహా అన్నీ జిల్లాకు వెళ్ళాయన్నారు. కర్నూల్ జిల్లాలో నీటి ఎద్దడి ఉందన్నారు.

ఇక్కడ సాగునీటి ప్రాజెక్ట్ లు చేపట్టింది టీడీపీప్రభుత్వమేనని, మూడేళ్లలో ఒక్క పని చేశారా అని వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. రోడ్ల మీద గుంతలు పడితే మట్టి వేయలేని సీఎం...మూడు రాజధానులు కడతాడా? అని నిలదీశారు. అన్ని పన్నులు పెంచారని, చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం జగన్ రెడ్డి అన్నారు.

 జగన్ ను నమ్మితే జైలుకేనన్న చంద్రబాబు

జగన్ ను నమ్మితే జైలుకేనన్న చంద్రబాబు

మళ్ళీ టీడీపీ వస్తేనే ఉద్యోగాలు అని యువత చెపుతుందని చంద్రబాబు అన్నారు. పత్తి రైతులకు నాసిరకం విత్తనాలు ఇచ్చి నష్టం చేశారని, ఈ ముఖ్యమంత్రి ఒక్క రైతుతో మాట్లాడారా? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు ఉండేది మన రాష్ట్రం లోనేనన్నారు. ఇదేమి ఖర్మ మనకు? ఈ శనికి కారణం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తనకు అధికారం ముఖ్యం కాదని,ప్రభుత్వ దోపిడీపై ప్రశ్నిస్తానని అన్నారు.

జగన్ ఒక్క టీచర్ జాబ్ ఇచ్చాడా? ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మళ్ళీ కోడుమూరు లో టీడీపీ జండా ఎగరాలన్నారు. పోలీసుల పొట్ట కూడా కొట్టిన ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం లో సీఐడీ పనికి మాలిన శాఖగా మారిందన్నారు. తప్పు చేసిన అధికారులను వదలబోమన్నారు.

జగన్ను నమ్మితే జైలుకే వెళ్లాల్సి వస్తుందన్నారు. బాబాయ్ హత్యలో ఏమయ్యింది చూడండి! ఎవరూ తప్పించుకోలేరన్నారు. డోన్ లో అప్పుల మంత్రి మా కార్యకర్త కాంపౌండ్ వాల్ కూల్చాడని బుగ్గనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను అనుకుంటే ఆ హరికథల మంత్రి ఏమవుతాడన్నారు. రాష్ట్రం లో ఎక్కడికక్కడ గాలి వీస్తోందని, ఈ గాలిలో వైసీపీ కొట్టుకు పోతుందన్నారు.

English summary
tdp chief chandrababu naidu on today visited several areas in kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X