నంద్యాలపై చంద్రబాబు ప్లాన్ ఇదీ: జగన్‌కు అభ్యర్థి దొరక్కుడా..

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు: నంద్యాల అసెంబ్లీ సీటు కోసం మంత్రి అఖిల ప్రియ, తమ తెలుగుదేశం పార్టీ నేత శిల్పా మోహన్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీక్రెట్ సర్వేకు నడుం బిగించినట్లు చెబుతున్నారు.

నంద్యాల అభ్యర్థి ఎంపికపై చంద్రబాబు అచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో రెండు కుటుంబాలు కూడా ముఖ్యమే కాబట్టి ఆయన శిల్పాను గానీ అఖిలప్రియను గానీ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అదే సమయంలో ఎవరికి సీటు ఇచ్చినా రెండు వర్గాలు కలిసి పనిచేస్తేనే ఫలితం సరిగా ఉంటుందనేది ఆయనకు తెలుసు.

రెండు వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోవడం కోసం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. శిల్పా మోహన్‌రెడ్డి, భూమా మౌనికారెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డిల్లో ఎవరికి నంద్యాల పట్టణంలో ప్రజాదరణ అధికంగా ఉందో తెలుసుకోవడానికి పార్టీ నాయకత్వం రహస్య సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం.

సర్వే ఫలితాలను బట్టే..

సర్వే ఫలితాలను బట్టే..

రహస్య సర్వే పూర్తయిన తర్వాత నంద్యాల ఉపఎన్నికలో అభ్యర్థిని ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో శిల్పా సోదరులు, పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియతో మరోసారి చర్చలు జరిపి వారి మధ్య సయోధ్యను సాధించేందుకు టీడీపీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారని సమాచారం.

సర్వే రిపోర్టు ఆధారంగానే...

సర్వే రిపోర్టు ఆధారంగానే...

అఖిల ప్రియ కుటుంబంలోనివారికి ఇవ్వాలా, శిల్పా మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలా అనేది మాత్రమే చంద్రబాబు తేల్చుకోవాల్సి ఉంది. టిక్కెట్ దక్కనివారు పోటీకి దిగినా లేదా పార్టీ అభ్యర్థికి సపోర్ట్‌ చేయకపోయినా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇరు వర్గాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికే చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సర్వే రిపోర్ట్ ఆధారంగా అభ్యర్థిని ప్రకటించాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

బయటకు వెళ్లకుండా...

బయటకు వెళ్లకుండా...

తమ తెలుగుదేశం పార్టీ నుంచి ఈ రెండు కుటుంబాల వారు బయటికి వెళ్లాకుండా ఉండేలా చూసేందుకు అవరమైన వ్యూహాన్ని చంద్రబాబు రచిస్తున్నట్లు చెబుతున్నారు.ప్రతిపక్ష అభ్యర్థి ఎవరనే విషయంపై కూడా చంద్రబాబు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. భూమా కుటుంబం పాటు శిల్పా ఫ్యామిలీ కూడా టీడీపీలోనే ఉంటే వైసీపీకి బలమైన అభ్యర్థి దొరకడం కష్టమవుతుంది. ప్రతిపక్షానికి సమర్థత కలిగిన అభ్యర్థి దొరకకపోతే టిడిపి విజయం సాధిస్తుంది.

జగన్ కూడా...

జగన్ కూడా...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్‌ కూడా నంద్యాల టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తూ సమాలోచనలు సాగిస్తున్నారని సమాచారం. ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ప్రకటించాకే తమ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. శిల్పా మోహన్ రెడ్డి టిడిపి టికెట్ దక్కక తమ పార్టీలోకి వస్తే ఆయనకు టికెట్ ఇచ్చే విషయాన్ని కూడా జగన్ సీరియస్‌గానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrababu Naidu is planning give a blow to YSR Congress party chief YS Jagan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి