బాబు సీరియస్, ఫోన్: 'కడప ఫ్యాక్షన్ రాజధానికి'

హైదరాబాద్: గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగిన అగ్ని ప్రమాదం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. మరోవైపు, ఈ ప్రమాదం పైన వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పరస్పరం బురద జల్లుకుంటున్నాయి.

టీడీపీ నేత పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. కడప ఫ్యాక్షన్ మాఫియా రాజధాని పైన వచ్చి వాలిందని, అగ్ని ప్రమాదాల వెనుక వైయస్ జగన్ హస్తం ఉందని ఆరోపించారు. ఈ సంఘటన పైన విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. పొలాలకు నిప్పంటించిన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Chandrababu serious on farms burning

చంద్రబాబు ఫోన్, విచారణాధికారి

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో సంభవించిన అగ్ని ప్రమాదం పైన పోలీసులు విచారణ చేపట్టారు. ఉండవల్లి, పెనుమాకలో అగ్ని ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేశారు. విజయవాడ - గుంటరు నగరాల నుండి పెద్ద సంఖ్యలో పోలీసులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. రాజధాని ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు.

ప్రమాదం విషయం తెలియగానే జిల్లా అధికారులకు ఫోన్ చేసిన ఆయన విచారణకు ఆదేశించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. గుంటూరు అర్బన్ ఎస్సీ ప్రమాదం పైన వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశంతో అధికారులు బాధితులను ఫోన్లో మాట్లాడించారు. అగ్ని ప్రమాం పైన ప్రభుత్వం విచారణ అధికారిని నియమించింది. ట్రాన్స్‌కో అధికారి విజయానంత్ నియమితులయ్యారు.

ఎవరు నిద్రపోవడం లేదు: ఆల్ల రామకృష్ణా రెడ్డి

ఏపీ రాజధాని ప్రకటన చేసిన తర్వాత రైతులు ఎవరూ గ్రామాల్లో నిద్రపోవడం లేదని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. గ్రామాలు వదిలిపెట్టి పొలాల్లో నిద్రపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి భూములు ఇవ్వని రైతులను లక్ష్యంగా చేసుకొని బీభత్సం సృష్టించారన్నారు. ఎనిమిది నుండి పది మంది వరకు ఈ దారుణానికి పాల్పడ్డారని రైతులు చెబుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+