వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మాటకు నరాలు బిగుసుకుపోయాయి.. సిగ్గు, బాధ కుదిపేశాయి: చంద్రబాబు

ఏపీ పెట్టుబడిదారులంటే మోసానికి ప్రతీకలన్న అభిప్రాయాలను తుడిచిపెట్టేలా చేసి.. వారిపై విశ్వాసం కలిగించే స్థాయికి తీసుకొచ్చానని చంద్రబాబు ధీమాగా చెప్పారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: అమరావతిలో బుధవారం నాడు జరిగిన కేబినెట్ భేటి అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా గతంలో ఆయనకు ఎదురైన ఓ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. ఏపీ ప్రజలను అవమానపరిచేదిగా ఉన్న ఆ ఘటనను తలుచుకుంటూ చంద్రబాబు ఆవేదన చెందారు.

అమెరికాకు చెందిన ఓ వెంచర్ క్యాపిటలిస్ట్ తనను కలిసినప్పుడు అన్న మాటలను సీఎం మీడియా సమావేశం సందర్బంగా ప్రస్తావించారు. ఆంధ్ర పెట్టుబ‌డిదారులంటే మోసానికి కేరాఫ్ అనే అర్థం వచ్చేలా సదరు క్యాపిటలిస్ట్ మాట్లాడారట. ఆ మాటలు విన్న వెంటనే తన నరాలు బిగుసుకుపోయాయని, సిగ్గు, బాధ తనను కుదిపేశాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Chandrababu shared a venture capitalist words regarding ap investors

అయితే ఆ మాటలకు బదులిస్తూ.. ఎన్నాళ్ల క్రితం ఈ పరిస్థితి మీకు కనిపించిందని సదరు క్యాపిటలిస్టును చంద్రబాబు ప్రశ్నించారట. దీనికి ఆయన ఓ నాలుగేళ్ల క్రితం అని సమాధానం చెప్పారట. ఆ సమయంలో కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి..వారి హయాంలో కొన్ని తప్పులు జరిగాయన్నారు చంద్రబాబు.

ఏపీ పెట్టుబడిదారులంటే మోసానికి ప్రతీకలన్న అభిప్రాయాలను తుడిచిపెట్టేలా చేసి.. వారిపై విశ్వాసం కలిగించే స్థాయికి తీసుకొచ్చానని చంద్రబాబు ధీమాగా చెప్పారు.

English summary
On wednesday AP CM Chandrababu Naidu talked to media. While he talking on cabinet decisions, he mentioned about the bad work of congress in the past
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X