అంత మాటంటారా?, అరెస్ట్ చేయండి: బాబుపై భూమన ఫైర్

చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను తలుచుకుంటే ఓటుకు రూ. 5వేలు ఇవ్వగలనన్న చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో రూ. 5కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీని కొనుగోలు చేయాలని చూసిన చంద్రబాబు.. ఇప్పుడు ఓటర్లను కూడా రూ. 5వేల చొప్పున ఇచ్చి కొనుగోలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

Chandrababu should arrested, says bhumana karunakar reddy

చౌకబారు రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలకు ఏదో మేలు చేసినట్లు చెప్పుకుంటున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

నేను ఇచ్చే రేషన్ తీసుకుంటున్నారు.. నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు.. నేను ఇచ్చే పెన్షన్ తీసుకుంటున్నారని చంద్రబాబు అనడం సిగ్గు చేటని అన్నారు.
చంద్రబాబు తన అబ్బ సొత్తు ఏమైనా ధారాదత్తం చేస్తున్నారా? అని మండిపడ్డారు.
ప్రజలు అంటే చంద్రబాబుకు ఓటర్లుగానే కనిపిస్తున్నారని.. ఓటు ఉన్నవాడే మనిషి అన్న ఆలోచనతో ఆయన బతుకుతున్నారని భూమన మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+