వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినాయక చవితి వేడుకలపైనే ఆంక్షలెందుకు?: దిశ చట్టమే లేదంటూ చంద్రబాబు ఫైర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం టీడీపీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. కరోనా సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, వినాయక చవితి వేడుకల నిర్వహణ తదితర అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఏపీలో లేని దిశ చట్టాన్ని ఉన్నట్లుగా జగన్ రెడ్డి ప్రజలను భ్రమింపజేస్తున్నారని మండిపడ్డారు. దిశ చట్టం ఎక్కడ ఉందో సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాధిత మహిళలకు న్యాయం జరిగేందుకు సెప్టెంబర్ 9న గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు చెప్పారు.

Ritu Varma: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారిన టాలెంటెడ్ యాక్ట్రెస్ హోమ్లి బ్యూటీ రీతూ(ఫొటోస్ )Ritu Varma: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారిన టాలెంటెడ్ యాక్ట్రెస్ హోమ్లి బ్యూటీ రీతూ(ఫొటోస్ )

వినాయక చవితి వేడుకలకే ఆంక్షలెందుకు?

వినాయక చవితి వేడుకలకే ఆంక్షలెందుకు?

తెలంగాణలో వినాయక చవితి పూజలకు అనుమతించగా.. మరి ఏపీలో ఎందుకు అనుమతి నిరాకరించారని చంద్రబాబు ప్రశ్నించారు. అంతేగాక, ఇడుపులపాయతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ వర్థంతికి వర్తించని కోవిడ్ నిబంధనలు వినాయక చవితికి ఏ విధంగా వర్తిస్తాయి.. అసలు వినాయక చవితి పూజలకు ఆంక్షలు ఏవిధంగా పెడతారని చంద్రబాబు ప్రశ్నించారు. అంతేగాక, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. 175 నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 10వ తేదీన చవితి పూజా కార్యక్రమాలను నిర్వహించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీలో రోజు రోజుకీ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని, కమీషన్ల కోసం విద్యుత్ ను బయట నుంచి కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Blushing beauty Nivetha Thomas: బ్యూటిఫుల్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న మలయాళ కుట్టి (ఫొటోస్)Blushing beauty Nivetha Thomas: బ్యూటిఫుల్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న మలయాళ కుట్టి (ఫొటోస్)

ఏపీలో కల్తీ మద్యం అంటూ చంద్రబాబు ఫైర్

ఏపీలో కల్తీ మద్యం అంటూ చంద్రబాబు ఫైర్

దశలవారీ మద్యపాన నిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్ రెడ్డి.. ప్రజలను మోసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ధరల పెంపుతో పాటు నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారని ధ్వజమెత్తారు చంద్రబాబు. మద్యంలో ఇప్పటికే రూ.25 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్లు చాలా అధ్వానంగా మారాయి, రెండేళ్ల పాలనలో ఎక్కడా ఒక్క రోడ్డు వేయలేదన్నారు. రోడ్డు సెస్ రూ.1200 కోట్లు ఏమి చేశారని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు.

లూటీ చేసేందుకే జగన్ అప్పులు చేస్తున్నారు..

లూటీ చేసేందుకే జగన్ అప్పులు చేస్తున్నారు..


ఆడలేక మద్దెలోడు అన్నట్లుగా అప్పులు చేసిన వైసీపీ నేతలు.. టీడీపీపై బురద జల్లుతున్నారని.. జగన్ రెడ్డి అండ్ కో లూఠీ కోసమే అప్పులు చేశారని.. సంక్షేమం కోసం, కరోనా కోసం కాదని వ్యాఖ్యానించారు. కరోనా కష్ట కాలంలోనూ పన్నుల పెంపు ద్వారా రూ.75 వేల కోట్లు భారం ప్రజలపై మోపారు. రూ.2 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఈ నిధులు లూటీ కాబట్టే అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాల్లో కోతలు పెడుతున్నారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో చింతమనేని ప్రభాకర్, దియ్యా రామకృష్ణ తదితర నేతల అక్రమ అరెస్ట్ లపై ప్రైవేటు కేసులు పెట్టాలని సూచించారు. ఇదే విషయంపై తాము న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

బెంగూళూరు ప్యాలెస్ కోసమేనంటూ దేవినేని..

బెంగూళూరు ప్యాలెస్ కోసమేనంటూ దేవినేని..

మరోవైపు, టీడీపీ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. బెంగళూరులో తనకున్న ప్యలెస్‌లను కాపాడుకునేందుకే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నా.. సీఎం జగన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర రైతాంగ హక్కుల్ని తాకట్టు పెట్టే అధికారం జగన్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును దాదాపు ఐదున్నర మీటర్ల మేర పెంచి 18 అడుగుల మేర గేట్ల నిర్మాణం చేస్తుంటే సీఎం మొద్దునిద్రపోతున్నారని మండిపడ్డారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించే అక్రమ ప్రాజెక్టులను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కేంద్ర గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు పేరు లేకపోయినా సీఎంలో కనీసం స్పందన రాలేదని ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 50 శాతం వాటా ఉందని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసి ప్రధాని, కేంద్రహోంమంత్రిని కలుస్తుంటే జగన్ ఏం చేస్తున్నారని దేవినేని ఉమ ప్రశ్నించారు. గత 28 నెలల్లో పోలవరం పనులు ఎంతశాతం పూర్తిచేశారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని దేవినేని డిమాండ్ చేశారు.

English summary
chandrababu slams cm ys jagan for ban on vinayaka chavithi celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X