తెలంగాణపై చంద్రబాబు సంచలన కామెంట్స్.. అక్కడ అన్ని వివాదాలే

మన పూర్వీకులు ఆర్జించిన భూమిపై ఆయన ఫోటో ఏమిటి.? సరిహద్దు రాళ్లపై ఆయన ముద్రలేమిటి? అంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు. కూటమి అధికారంలోకి రాకపోతే ప్రజల భూములన్నీ కాజేసేందుకు కుట్రపన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. నిన్నా మొన్నా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు చాలా ప్రమాదకరమైన ఆలోచన చేశారని నిప్పులు చెరిగారు. ఏపీలో ఏపీ ప్రాంతంలో ఉన్న రికార్డులు అన్నీ పక్కాగా ఉన్నాయని. తెలంగాణా ప్రాంతంలో ఎక్కువ భూవివాదాలే ఉన్నాయంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో మీ భూమి- మీహక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాయవరంలో కంటిపూడి సత్యసాయిబాబా అనే రైతుకు పట్టాదారు పాసు పుస్తకాన్ని సీఎం అందించారు. అనంతరం పాసు పుస్తకంలో ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను సెల్ ఫోన్‌లో స్కాన్ చేయించి.. మ్యాప్ ద్వారా పొలం వద్దకు రైతు, అధికారులతో పాటు సీఎం చంద్రబాబు వెళ్లారు. ఎవరి ఫోటోలు లేకుండా రాజముద్రతో తమకు పట్టాదారు పుస్తకం ఇవ్వడం సంతోషంగా ఉందని రైతు సత్యసాయిబాబా సీఎంతో అన్నారు.

Chandrababu Slams Previous Regime Over Land Records Introduces Secure Digital Pattadar Passbooks
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పూర్వీకుల నుంచి సంక్రమించిన, స్వార్జితమైన భూమితో రైతులకు ఓ అనుబంధముందని గుర్తు చేశారు. కరోనా సమయంలో అంతా సెలవు తీసుకున్నా... మనందరికి అన్నం పెట్టే రైతన్నకు సెలవే లేదన్నారు. గత పాలకులు పాస్ పుస్తకాల జారీ విషయంలో అస్తవ్యస్తంగా అక్రమాలు చేశారని ఆరోపించారు. గత పాలకుల్ని, ప్రభుత్వాన్ని హెచ్చరించానని... కానీ వారి అహంకారం నెత్తికెక్కి మీ ఆస్తులపై జగన్ ఫోటో వేసుకున్నారని చెప్పుకొచ్చారు.

చాలా ప్రమాదకరమైన ఆలోచన

మన పూర్వీకులు ఆర్జించిన భూమిపై ఆయన ఫోటో ఏమిటి.? సరిహద్దు రాళ్లపై ఆయన ముద్రలేమిటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ ఓ చట్టాన్ని తెచ్చి ఆయనకు నచ్చిన వాళ్ల ఆధీనంలోకి తీసుకువచ్చేలా చేశారు. దీనిని గతంలోనే తీవ్రంగా వ్యతిరేకించాను. మీ భూముల వివరాలన్నీ గత పాలకుల అనుచరులు అమెరికాలో పెట్టుకున్నారు. కూటమి అధికారంలోకి రాకపోతే ప్రజల భూములన్నీ కాజేసేందుకు కుట్రపన్నారు. నిన్నా మొన్నా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు చాలా ప్రమాదకరమైన ఆలోచన చేశారు.మీ భూమి మీ హక్కు వాటి పై వేరేవాళ్ల ఫోటోలెందుకని ప్రశ్నించాను. రాజముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. గత పాలకులు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ రెండో సంతకమే పెట్టాను. భూమి అనేది రైతుకు ఆస్తి మాత్రమే కాదు ఓ విశ్వాసం, కుటుంబంతో కలిసిపోయిన సెంటిమెంట్. గతంలో భూమి ఇవ్వకపోతే దానిని 22 ఏ రికార్డుల్లో పెట్టేశారు.అందుకే ప్రజలు ఆలోచించి సమయం వచ్చినప్పుడు చూద్దామని బ్యాలెట్ ద్వారా తగిన బుద్ధి చెప్పారు - సీఎం చంద్రబాబు

తెలంగాణలో అన్నీ భూవివాదాలే

ఏపీ ప్రాంతంలో ఉన్న రికార్డులు అన్నీ పక్కాగా ఉన్నాయన్న సీఎం చంద్రబాబు.. తెలంగాణా ప్రాంతంలో ఎక్కువ భూవివాదాలే ఉన్నాయని విమర్శించారు. మునుసుబు, కరణాల వ్యవస్థను రద్దు చేసి ఎన్టీఆర్ రైతులకు, భూ యజమానులకు మేలు చేశారని గుర్తుచేశారు. ఆ వ్యవస్థ రద్దు అయినప్పుడు తెలంగాణాలో ప్రజలు పండుగ చేసుకున్నారని అన్నారు. గత పాలకుల తీరుతో ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా భూ వివాదాల పిటిషన్లే వస్తున్నాయని చెప్పారు. ఈ భూ వివాదాలన్నింటినీ పరిష్కరించాలనే సంకల్పంతో ప్రజల వద్దకు వచ్చానని చంద్రబాబు స్పష్టం చేశారు. తహసీల్దార్ కార్యాలయాలకే పరిమితం కాకుండా గ్రామసభల ద్వారా పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎక్కడా మోసం జరగకుండా, వివాదాలకు తావివ్వకుండా రాజముద్రతో 'మీ భూమి - మీ హక్కు' పాస్‌పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు.

భూ రికార్డులన్నింటినీ పద్ధతి ప్రకారం రీసర్వే చేసి, ట్యాంపర్ చేయలేని విధంగా భద్రపరుస్తున్నామని సీఎం వెల్లడించారు. భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని తెలిపారు. జారీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకంపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే రైతుల భూ వివరాలు వెంటనే కనిపించేలా అత్యాధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+