జగన్ కు చంద్రబాబు ఘాటు కౌంటర్- నా నోటితో చెప్పలేను..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయిన సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్ వరుసగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తోంది. ఈ క్రమంలో వైఎస్ భారతి పీఏ, సోషల్ మీడియా కార్యకర్త కూడా అయిన వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు వ్యవహారం కలకలం రేపింది. ఆయనకు సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల, విజయమ్మపైనా పోస్టులు పెట్టిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్ ఆయన్ను వెనకేసుకొచ్చారు.
వర్రా రవీందర్ రెడ్డి అకౌంట్ ను హ్యాక్ చేసి కూటమి నేతలు పోస్టులు పెట్టించారని వైఎస్ జగన్ నిన్న ఆరోపించారు. ఫేక్ అకౌంట్ తో పోస్టులు పెట్టించి వర్రా రవీందర్ రెడ్డిని అరెస్టు చేశారని ఆరోపించారు. దీనిపై ఇవాళ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పందించి ఘాటు కౌంటర్ ఇచ్చారు. వర్రా రవీందర్ రెడ్డి షర్మిలపై పెట్టిన పోస్టుల్ని గుర్తుచేశారు. వాటిని తాను నోటితో చెప్పలేనన్నారు. అసెంబ్లీలో ఉచ్ఛారణకు కూడా వీలులేని భాషలో అవి ఉన్నాయన్నారు.

అలాంటి వర్రా రవీందర్ రెడ్డిని జగన్ వెనకేసుకు వస్తారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఇంకా ఆయన్ను ఎందుకు వెనకేసుకు వస్తున్నారని జగన్ ను చంద్రబాబు ప్రశ్నించారు. వర్రాపై షర్మిల చేసిన ఆరోపణల్ని కూడా చంద్రబాబు గుర్తుచేశారు. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి వంటి వారు వర్రాతో పోస్టులు పెట్టించారని, ఆయన్ను కూడా అరెస్టు చేయాలని షర్మిల కోరుతున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications