Chandrababu Cabinet: పవన్ తో సహా నూతన మంత్రులు వీరే - చంద్రబాబు మార్క్ ఎంపిక..!!
Chandrababu Cabinet:ఏపీలో నూతన ప్రభుత్వం కొలువు తీరేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం సిద్ధమైంది. ఇక చంద్రబాబు క్యాబినెట్లో మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు తన మంత్రివర్గ సభ్యులను ప్రకటించారు. అంచనాలకు భిన్నంగా మంత్రులు ఎంపికలో చంద్రబాబు తన మార్కు చూపించారు.
జనసేన నుంచి
చంద్రబాబు తన కొత్త మంత్రివర్గంలో జనసేనకు మూడు, బిజెపికి ఒక మంత్రి పదవి కేటాయించారు. ముగ్గురు మహిళలను ఎంపిక చేశారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు అవకాశం దక్కింది. బిజెపి నుంచి సత్య కుమార్ మాత్రమే మంత్రి కానున్నారు. టిడిపి నుంచి నారా లోకేష్ తో పాటుగా అచ్చం నాయుడు, కొల్లు రవీంద్ర, నారాయణ, వంగలపూడి అనిత, రామానాయుడు, నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి ఉన్నారు.

అనూహ్య ఎంపిక
వీరితో పాటుగా ప్రకాశం జిల్లా నుంచి డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే సవిత, తూర్పుగోదావరి నుంచి వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మందపల్లి రాంప్రసాద్రెడ్డిలను చంద్రబాబు ఎంపిక చేశారు. కొందరు సీనియర్లతో పాటు తొలిసారి ఎమ్మెల్యే అయిన వారికి సైతం తన మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్లకు స్థానం దక్కలేదు.

సీనియార్టీ - యువత కు ప్రాధాన్యత
అనూహ్యంగా విశాఖ జిల్లా నుంచి కేవలం ఎస్సీ మహిళ వంగలపూడి అనితకు మాత్రమే క్యాబినెట్లో అవకాశం దొరికింది. అక్కడ నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మంత్రివర్గంలో బెర్తు ఆశించారు. అదేవిధంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోనూ చంద్రబాబు ఎంపిక చర్చనీయాంశం గా మారింది. ఇక బీసీలకు ఈసారి ప్రాధాన్యత పెరిగింది. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ తో పాటు బిజెపి ఎమ్మెల్యే సత్య కుమార్ పేరు ఎంపిక చేశారు. తమకు మంత్రి పదవులు ఖాయం అనుకున్న పలువురు సీనియర్లకు నిరాశ తప్పలేదు. బిజెపి నుంచి ఇద్దరికీ అవకాశం దక్కుతుందని భావించినా.. ఒక్కరికి ఛాన్స్ దక్కింది. కడప జిల్లా నుంచి రాయచోటి ఎమ్మెల్యే మందపల్లి రాంప్రసాద్ రెడ్డికి క్యాబినెట్లో అవకాశం కల్పించారు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications