ఢిల్లీలో అమిత్ షా కాళ్ళు మొక్కిన చంద్రబాబు షాకింగ్ ఫోటో వైరల్!!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిన్న రాత్రి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో, అలాగే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో భేటీ అయ్యారు. ఇప్పటికే ఏపీలో ఎన్నికలకు సంబంధించి రాజకీయాలు కొనసాగుతున్న తరుణంలో టిడిపి జనసేన పొత్తులను ప్రకటించి ఎన్నికలకు వెళుతుంది.

ఇదే క్రమంలో బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కానున్నారని సమాచారం . అయితే రెండు పార్టీలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఇదిలా ఉంటే టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సోషల్ మీడియాలో చంద్రబాబు ఫోటోలు వైరల్ గా మారాయి.

Chandrababu touching Amit Shah feet photo is viral!!

ఈ ఫోటోలో చంద్రబాబు వంగి అమిత్ షా కాళ్ళు మొక్కడం ప్రధానంగా కనిపిస్తుంది. అంతేకాదు మెట్రోలో ప్రధాని నరేంద్ర మోడీ ముందు చంద్రబాబు చేతులు కట్టుకుని నిల్చున్నట్టుగా కూడా మరో ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చర్చల కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అమిత్ షా అక్కడ చేసింది ఇదేనని అన్ని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ ఫోటో మార్ఫింగ్ చేసి, ఎడిట్ చేసిన ఫోటో అని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా 2018లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, యోగాసనాలు వేసిన సమయంలో ఆయన వంగి చేసిన యోగాసనాల తాలూకా ఫోటోను, బిజెపి అగ్రనేత మురళీ మనోహర్ జోషి కి అమిత్ షా నమస్కరిస్తున్న ఫోటోను జతచేసి ఈ ఫోటోను సృష్టించినట్లుగా చెబుతున్నారు.

గతంలో మెట్రో రైలులో ప్రధాని నరేంద్ర మోడీ యువతతో ముచ్చటిస్తున్న ఫోటోను ఎక్కడో చంద్రబాబు చేతులు కట్టుకొని నిలుచున్న ఫోటోను కలిపి ఎడిట్ చేశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చేసింది ఇదేనని, అవసరానికి చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని చెప్పే ప్రయత్నం చేశారని ఇలాంటి ఫేక్ రాజకీయాలు చెల్లవని తెలుగు తమ్ముళ్ళు భగ్గుమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+